Crime News: ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం - 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు, ఒంగోలులో దారుణం
Ongole News: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తించాడు. 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించాడు. ఈ దారుణ ఘటన ఒంగోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Father Gives Acid To 9 Months Old Child In Ongole: భార్యపై అనుమానం పెనుభూతమైంది. ఆ చిన్నారి తనకు పుట్టలేదనే అనుమానంతో ఆ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. పాప అనే కనికరం లేకుండా 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు. తీవ్రమైన నొప్పితే విలవిల్లాడిన చిన్నారిని తల్లి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించింది. ఈ దారుణ ఘటన ఒంగోలు మండలం కరవది గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్యం జిల్లా పాడేరుకు చెందిన మువ్వల భాస్కర్, లక్ష్మి దంపతులు 10 రోజుల క్రితం ఒంగోలుకు (Ongole) వచ్చారు. కరవది సమీపంలోని రొయ్యల చెరువుల్లో ఉపాధి నిమిత్తం వీరు ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరికి 9 నెలల చిన్నారి ఉండగా.. భార్య లక్ష్మిపై భర్త భాస్కర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతో తరచూ గొడవపడేవాడు.
యాసిడ్ తాగించేశాడు
అనుమానం పెనుభూతమై భాస్కర్ ఉన్మాదిలా మారిపోయాడు. ఈ క్రమంలోనే రొయ్యలకు వ్యాధులు రాకుండే చెరువుల్లో వాడే యాసిడ్ లాంటి ద్రావణాన్ని 9 నెలల చిన్నారికి తాగించాడు. దీంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడిన చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. చిన్నారిని గమనించిన తల్లి, స్థానికులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్య కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బిడ్డను ఏం చేశావంటూ భర్తను.. భార్యతో సహా స్థానికులు నిలదీయగా ఆ బిడ్డ తనకు పుట్టలేదని తన ఊర్లో చాలామంది చెప్పారంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అందుకే చంపేందుకు యాసిడ్ పోశానని తెలిపాడు. కర్కశ తండ్రిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !