అన్వేషించండి

Sri Goda Ranganatha Kalyanotsavam: ఆండాళ్ ఎవరు - భక్తితో కూడిన ఆమె అద్భుతమైన ప్రేమకథ తెలుసా!

మానవజన్మ ఎత్తిన వారు భగవంతుడిలో ఐక్యం అవడం సాధ్యమా? అది కూడా సాక్షాత్తూ దేవిడిని వరించి?..ఈ ప్రశ్నలకు సమాధానమే శ్రీరంగనాథుడి కోసం గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ కథ.

Eternal Love Story of Andal's:  ప్రతి సంవత్సరం భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది. వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ కళ్యాణ వేడుక తిలకించేందుకు రెండుకళ్లు సరిపోవు...గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి జీవితంలో సంతోషం తథ్యం అని చెబుతారు పండితులు

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం. ధను అంటే ప్రార్థించడం అని అర్థం. ఈ నెలలో చేసే తిరుప్పావై వ్రతం చాలా ప్రత్యేకం. 
గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. 'తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేదా వ్రతం అని అర్ధం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాట. 

Also Read: ఆండాళ్ , గోదాదేవి ఎవరు - ధనుర్మాసంలో తిరుప్పావై, పాశురాలు అంటే ఏంటి!

ఆండాళ్ అంటే ఎవరు!

శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు వటపత్రశాయిగా లోకాన్ని రక్షించాడని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు  అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు..నిరంతరం ఆయన చిత్తం శ్రీ మహావిష్ణువు మీద ఉండేది అందుకే  విష్ణుచిత్తుడు అంటారు. విష్ణుచిత్తుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వారు) అన్న గౌరవాన్ని అందించారు. పెరియాళ్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. తులసివనంలో కనిపించిన చిన్నారిని  భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఆమెకు ‘కోదై’ (పూలమాల) అనే పేరు పెట్టాడు..ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది.

Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!

అనుక్షణం కృష్ణుడి ఆరాధనే

గోదాదేవి చిన్నప్పటి నుంచీ కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది. తన చుట్టూ ఉన్నవారంతా గోపికలు అని ..తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వ్రజపురమని భావించింది. అంతేకాదు! రోజూ తండ్రి విష్ణుచిత్తుడు  భగవంతుని కోసం సిద్ధం చేసిన  మాలలను ముందుగా తాను వేసుకుని..అవి స్వయంగా శ్రీ కృష్ణుడే వేసినట్టు మురిసిపోయేది. ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తూ ఆ భూదేవి అవతారమేననీ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గోదాకి కృష్ణుడికి మరింత ప్రేమ పెరిగి కృష్ణుడితో పెళ్లైనట్టు భావించి కాత్యాయనీ వ్రతం ప్రారంభించింది. తన చెలికత్తెలని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది. నిత్యం తెల్లవారుఝామున వారిని మేల్కొలిపేందుకు, వ్రత విధానాన్ని తెలిపేందుకు, కృష్ణుడిపట్ల తన భక్తిని వెల్లడించేందుకు రోజుకో పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు పాడింది. అవే ధనుర్మాసంలో వినిపించే తిరుప్పావై..

Also Read: భోగిపళ్లు ఎందుకు పోయాలి - రేగుపళ్లే ఎందుకు!

గోదా ప్రేమకు కరిగిపోయిన రంగనాథుడు

గోదాదేవి ప్రేమకు కరగిపోయాడు శ్రీ కృష్ణుడు. తానే స్వయంగా మళ్లీ విష్ణుచిత్తుని కలలో కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మనీ అక్కడ రంగనాథునిగా వెలసిన తాను  గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ ని వివాహమాడతాననీ చెప్పాడు.  శ్రీరంగంలోని ఆలయ అర్చకులకూ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేవు. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి  వెళ్లాడు. పెళ్లికూతురిగా ముస్తాబైన గోదాదేవి అందరూ చూస్తుండంగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. అందుకే ఈ రోజున  వైష్ణవాలయాల్లో గోదాదేవికి ఆ రంగనాథుని కళ్యాణం జరిపిస్తారు. 

పెళ్లికానివారు, కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారసు..భగవంతుడిపై మనసు లగ్నంచేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతారు. వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయని చెబుతారు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
World Test Championship points table: అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
అడిలైడ్ ఓటమి, భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం- చాలా సమీకరణాలు కలిస్తేనే తుదిపోరుకు ఛాన్స్
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Gajwel Hit and Run Case: గజ్వేల్ లో విషాదం - హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మృతి
గజ్వేల్ లో విషాదం - హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మృతి
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Embed widget