సంక్రాంతి 2024: భోగి మంటల్లో ఇవి వేయకండి

భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం.

హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా వెలిగించాలి.

స్నానమాచరించి శుచిగా ఉన్న వ్యక్తే భోగి మంట వెలిగించాలి...అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది .

ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప, పేడ పిడకలు వేసేవారు. బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు.

పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయి

పిడకలు, చెట్టు బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసేవారు.

కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలను భోగిమంటల్లో వేస్తున్నారు.

ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేయడమే సరికాదంటే..అవి సరిగా మండడం లేదని పెట్రోల్, కిరోసిన్ పోస్తున్నారు

రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరోసిన్ నుంచి వెలువడే పొగతో పర్యావరణం కలుషితమవుతోంది.

తెల్లవారుజామునే చలిగాలుల మధ్య వెచ్చని భోగిమంట వేసుకుని సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం పలుకుతారు..

Images Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

రేగుపళ్లనే భోగిపళ్లుగా పోస్తారెందుకు!

View next story