రేగుపళ్లనే భోగిపళ్లుగా పోస్తారెందుకు! శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తుండగా దేవతలు వారిపై బదరీ ఫలాలని కురిపించారు అందుకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్లు పోసే సంప్రదాయం వచ్చిందంటారు రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. ఉత్తరాయణం వైపు మళ్లే సూర్యుడి కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. వీరికి రేగుపళ్లు అమృతంలా పనిచేస్తాయట. రేగుపళ్లను తలపై భాగంలో పోయడం వల్ల బ్రహ్మరంధ్రం ప్రేరేపితమైన జ్ఞానం పెరుగుతుందని చెబుతారు. నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. ముఖ్య పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్లు పోయడం వెనుక ముఖ్య ఉద్దేశం దోసిలి నిండా రేగు పళ్లు, చిల్లర, చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు మూడుసార్లు తలమీదుగా దిష్టి తీసి పోస్తారు. Images Credit: Pinterest