శని దోషం తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి! సూర్యుడు ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు తన కుమారుడైన శనితో కలసి దాదాపు నెలరోజులు ఉంటాడు ఆ నెల రోజులు సూర్యుడి తేజస్సు మందు శని తేజస్సు మసకబారుతుంది..అంటే శని ప్రభావం తగ్గుతుంది. తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని..తనకు ఇష్టమైన నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడు ఈ రోజు ఎవరైతే తనకు నల్ల నువ్వులు సమర్పిస్తారో వారికి శని బాధలు తొలగి, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో వర్థిల్లుతారని చెప్పాడట. అందుకే ఏటా మకర సంక్రాంతి రోజు సూర్యుడి పూజలో నల్ల నువ్వులు ఉపయోగిస్తారని చెబుతారు. సూర్యుడికి, శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను సంక్రాంతి రోజు ధారపోసినా, దానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం మకర సంక్రాంతి రోజు చేసే దానం, పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి Image Credit: Pinterest