ఈ సంక్రాంతి ఇలా ప్లాన్ చేసుకోండి కొన్ని చిన్న చిన్న విషయాలు పాటించడం ద్వారా పండుగ ఆనందం రెట్టింపు అవుతుంది సంక్రాంతి సమయంలో గలగలపారే నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. సంక్రాంతి సెలవులకు ఊరెళ్లినప్పుడు సూర్యోదయాన్ని ఆస్వాదించండి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ రోజు దానాల్లో ముఖ్యంగా నల్లనువ్వులు అత్యంత ముఖ్యం అని గుర్తుంచుకోండి. నువ్వులు దానం చేస్తే శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి నువ్వులతో చేసిన వంటలను అందరకీ పంచండి పండుగ అంటేనే అందరి ఆనందం. అందుకే సంక్రాంతి రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయండి. Image Credit: Pinterest