అన్వేషించండి

Makar Sankranti 2024: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!

Makar Sankranti 2024: సంక్రాంతి సందడి మొదలైనప్పటి నుంచీ ఉత్తరాయణ పుణ్యకాలం అనే మాట వినిపిస్తుంటుంది. ఇంతకీ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి? ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది..

Makar Sankranti 2024 Uttarayana Punyakalam: 2024 జనవరి 15 సోమవారం సంక్రాంతి...ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది...

'సరతి చరతీతి సూర్యః'

అంటే సంచరించేవాడు అని అర్థం.

సూర్యుడి సంచారం రెండు విధాలు

  • మొదటిది ఉత్తరాయణం
  • రెండోది దక్షిణాయనం

మానవులకు ఏడాది కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం. 

'ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత'

అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు...6 నెలల దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం 

సంక్రాంతి అంటే

"సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అని అర్థం. సూర్యుడు మేషం నుంచి ద్వాదశ రాశుల్లో మారుతూ  పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి. ఈ రోజు ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేది  భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే స్నానమాచరిస్తారో వారికున్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయని, దారిద్ర్యం తొలగిపోతుందని పండితులు చెబుతారు. 

Also Read: భోగిపళ్లు ఎందుకు పోయాలి - రేగుపళ్లే ఎందుకు!

ఉత్తరాయణ పుణ్యకాలం అంటే 

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే..మరి దక్షిణాయనం పాపకాలమా అనే సందేహం వద్దు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే..అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. ఉత్తరాయణంలో దేవతలకు పగటి సమయం అంటే ఆరు నెలల పాటు మేల్కొని ఉండే సమయం. అందుకే ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా ఉంటుంది.

వేదాల్లోనూ సౌత్ కన్నా నార్త్ కే ప్రాధాన్యం

సాధారణంగా దక్షిణ దిక్కు కన్నా ఉత్తర దిక్కుని పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే వేద జననం ఉత్తర భూముల్లో జరగడం , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు రావడం,  సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే నివాస స్థానాలు కావటంతో పాటూ  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్ల ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. 

Also Read: సంక్రాంతికి నాన్ వెజ్ తింటున్నారా - పండుగ వేళ మీరు అస్సలు చేయకూడని పనులివే!

సంక్రాంతి అందుకే పెద్దపండుగ

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగానూ , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగా చెబుతారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని ఈ సమయంలో భక్తితో ఏం కోరుకున్నా దేవతలు తీరుస్తారని పండితులు చెబుతారు. ఈ  విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగను పెద్ద పండుగగా జరపడం మొదలెట్టారట. 

Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!

పితృతర్పణాలు ప్రధానం

మనం నిద్రలేవగానే ఇంటి తలుపులు తీసినట్టే ఉత్తరాయణం ప్రారంభమైన ఈ రోజున దేవతలు నిద్రలేవడంతో ఈ ఆరు నెలలు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. వాస్తవానికి ప్రతి సంక్రాంతికి పితృతర్పణాలు ఇవ్వాలి...ముఖ్యంగా మకర సంక్రాంతికి తప్పకుండా పితృదేవతలను తలుచుకోవాలని చెప్పడం వెనుకున్న ఉద్దేశం కూడా ఇదే. ఈ రోజు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయి. మకర సంక్రాంతి రోజు పితృ తర్పణాలు విడిస్తే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం...

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Embed widget