అన్వేషించండి

Makar Sankranti 2024: సంక్రాంతి సమయంలో అస్సలు చేయకూడని పనులివే!

ఏ పండుగొచ్చినా..ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి,అలా సెలబ్రేట్ కోవాలి అనుకుంటూ చాలా ప్లాన్స్ వేస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చేయకూడదో తెలుసుకుంటే ఆపై జరిగేవన్నీ మంచి పనులేకదా..ఏంటి..అర్థంకాలేదా...

Makar Sankranti 2024:  పండుగ అంటే శుచి, శుభ్రతకే మొదటి స్థానం. పైగా సంక్రాంతి అంటే దాదాపు నెల రోజుల ముందునుంచీ సందడి మొదలవుతుంది. ఇల్లంతా దుమ్ము ధూళి దులిపేసి.. పండుగ సమయానికి ఇంటిని అద్దంలా మార్చేసే పనిలో ఉంటారు. మరోవైపు పండుగ మూడు రోజులు కొత్త బట్టలు, పిండివంటలు...ఆటలు పాటలు..ప్రతిక్షణం సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎంతో ప్రత్యేకం అయిన పండుగలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా అంతా శుభం జరుగుతుందని సూచిస్తున్నారు పండితులు.

స్నానం చేయకుండా ఏమీ తినొద్దు

కొందరికి బెడ్ పై ఉండగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరైతే లేచి బ్రష్ చేయగానే స్నానంతో సంబంధం లేకుండా టిఫిన్ లాగించేస్తారు. అడిగితే రకరకాల కారణాలు చెబుతారు. మరీ కదల్లేకుండా మంచానికే పరిమితమైతే వేరు...కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా కారణాలుగా చూపించి స్నానం చేయకుండానే లాగించేస్తారు. అయితే పండుగ రోజు ప్రత్యేక పూజ పునస్కారం మాట దేవుడెరుగు..కనీసం స్నానం ఆచరించి సూర్యుడికి నమస్కారం చేసి తింటే...ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. 

Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!

మొక్కలు నాటకపోయినా పర్వాలేదు చెట్లు కొట్టొద్దు

చెట్టు, పుట్ట, ప్రకృతి ఇలా అన్నీ పూజనీయమే అని భావిస్తారు. రావిచెట్టు లాంటివాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే మకర సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ. ఈ రోజు పంట చేతికి రావడంతో ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెబుతూ వాటికి పుసుపు, కుంకుమ అందిస్తాం. అలాంటప్పుడు చెట్లు నరికేయడం లాంటి ప్రకృతి విరుద్ధమైన పనులు చేయవద్దు. ఇప్పటికే తాగేనీళ్లు కొనుక్కుంటున్న మనం.. కరోనా సమయంలో గాలి కూడా కొనుక్కున్నాం. అందుకే చెట్లను దైవ స్వరూపాలుగా భావించకపోయినా పర్వాలేదు కానీ మనకు ప్రాణవాయువు అందించే వాటిని నాశనం చేయొద్దు.

Also Read: సంక్రాంతి పండుగ వెనుక ఎన్ని కథలున్నాయో తెలుసా!

మద్యం-మాంసం వద్దు

మకర సంక్రాంతి రోజు ఆటలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లు సందళ్లలో పడి మత్తు పదార్థాలపై మొగ్గుచూపుతారు. కానీ ఇది చాలా తప్పు అంటారు పండితులు. భోగి, సంక్రాంతి రోజు మద్యం తీసుకోవడం, మసాలా ఆహారం తినడం రెండూ మంచిది కాదంటారు. సూర్యుడు, శని అనుగ్రహంతో లభించాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా  నువ్వులు, చిక్కీ,  ఖిచ్డి, కొత్త బియ్యంతో చేసిన పిండి వంటలు తినొచ్చు. 

Also Read: సంక్రాంతికి ముగ్గులో 'సిరులు పొంగే కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!
 
చేయి చాచి ఆకలి అన్నవారిని ఖాళీగా పంపొద్దు

పండుగ వేళ మీ ఇంటి ముందు నిల్చున్న బిచ్చగాడిని ఖాలీ చేతులతో పంపవద్దు. మీకు తోచినంత దానం చేయండి. కడుపునిండా అన్నం పెట్టండి 

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

 ఆవేశం వద్దు

సూర్యుడు దిశ మార్చుకున్నట్టే.. ఇప్పటి వరకూ మిమ్మల్ని పట్టి పీడించే ఆగ్రహం, ఆవేశం, కోపాన్ని వదిలిపెట్టి సరికొత్త వెలుగును మీ జీవితంలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నించండి. అనవసరంగా ఎవ్వరితోనూ వివాదం పెట్టుకోవద్దు, సరదా అలకలు-బుజ్జగింపులు పండుగ సందడిని పెంచుతాయి కానీ ఎవ్వరి మనసు బాధపెట్టేలా ప్రవర్తించవద్దు. 

పండుగ సమయంలో ఆనందాన్ని రెట్టింపుచేసే చిన్న చిన్న మార్పులు పాటిస్తే ఏమవుతుంది..మహా అయితే మంచి జరుగుతుంది..

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Alekhya Chitti Pickles: మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
Viral News: ఉద్యోగుల్ని కుక్కలుగా చూశారు  - టార్గెట్లు సాధించలేదని ఇలా చేస్తారా? కేరళ కంపెనీ ఘోరాల వీడియో
ఉద్యోగుల్ని కుక్కలుగా చూశారు - టార్గెట్లు సాధించలేదని ఇలా చేస్తారా? కేరళ కంపెనీ ఘోరాల వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?Rishabh Pant Failures in IPL 2025 |  LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్Hardik Pandya vs LSG IPL 2025 |  LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదుTilak Varma Retired out | LSG vs MI మ్యాచ్ లో అతి చెత్త నిర్ణయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Alekhya Chitti Pickles: మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
Viral News: ఉద్యోగుల్ని కుక్కలుగా చూశారు  - టార్గెట్లు సాధించలేదని ఇలా చేస్తారా? కేరళ కంపెనీ ఘోరాల వీడియో
ఉద్యోగుల్ని కుక్కలుగా చూశారు - టార్గెట్లు సాధించలేదని ఇలా చేస్తారా? కేరళ కంపెనీ ఘోరాల వీడియో
Tirupati Crime News: ఫ్రెండ్ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు - ఇలాంటి స్నేహితులూ ఉంటారు !
ఫ్రెండ్ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు - ఇలాంటి స్నేహితులూ ఉంటారు !
Dhoni IPL Retirement: ఐపీఎల్ మ్యాచ్‌కు ధోనీ పేరెంట్స్‌- రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు !
ఐపీఎల్ మ్యాచ్‌కు ధోనీ పేరెంట్స్‌- రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు !
HCU Controversy: ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
Shock : ఎవర్ని పట్టుకున్న షాక్ కొడుతోందా ?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
ఎవర్ని పట్టుకున్న షాక్ కొడుతోందా ?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Embed widget