అన్వేషించండి

Makar Sankranti 2024: సంక్రాంతికి ముగ్గులో 'సిరులు పొంగే కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!

Makar Sankranti Kunda Muggu: భోగి, సంక్రాంతి పండుగకు ఇంటిముందు వేసే ముగ్గులలో తప్పనిసరిగా సిరులు పొంగే కుండే వేస్తారు. అందులోంచి పాలు పొంగి కిందకు పొంగేలా రంగులు దిద్దుతారు..ఎందుకో తెలుసా...

Sankranthi Bhogi Kunda Muggu : ప్రతి పండుగకు పిండివంటలు ప్రత్యేకమే అయినా సంక్రాంతికి చేసే పిండివంటలు మరింత ప్రత్యేకం. నువ్వులు, కొత్త బెల్లం, చెరకు, రేగుపళ్ళు, కొత్త బియ్యం ( ప్రాంతాన్ని బట్టి కొన్ని రకాల వంటలు మారుతాయి)తో వంటకాలు చేస్తారు. వీటితో పాటూ వారి వారి ఆర్థికస్థితిని బట్టి భక్ష్యాలు, గారెలు, బూరెలు, కుడుములు, పులిహోర, పాయసం ఊరంతా ఘుమఘుమలే. అన్ని పండుగల్లో సంప్రదాయ వంటలు ఉన్నప్పటికీ సంక్రాంతికి రోజు కొత్త కుండలో పొంగలి ప్రత్యేకం. అందులో పొంగలి అంటే కేవలం స్వీట్ కాదు..ఇల్లంతా సంతోషాన్ని పంచి, శుభం కలిగించే కమ్మని కుండ. 

భోగి 'కుండ' ఎందుకు!
సంక్రాంతి పండుగ సమయానికి పంట చేతికొచ్చి ధాన్యలక్ష్మి నిండుగా ఇంటికి చేరుతుంది. చెరకు కూడా విరివిగా కాస్తుంది. రేగుచెట్లు పళ్లతో కళకళలాడతాయి.  చెరకు పంట ఫ్యాక్టరీలకు చేరి బట్టిల్లో బెల్లం తయారవుతుంది. ఈ రోజు కొత్త కుండలో ఆవుపాలు, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి, చెరుకును ఉంచి పాలు పొంగిస్తే ఏడాదంతా ఆ ఇంట్లో సిరులు, ఆనందం పొంగిపొర్లుతుందని నమ్ముతారు.

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

ఇదే అసలైన నూతన సంవత్సరం
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితో మొదలైనప్పటికీ...పంట ఇంటికి చేరి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపే పండుగ మాత్రం సంక్రాంతి. ఆర్థికంగా కూడా ఆశాజనకంగా ఉండే సమయం. చలిగాలులు తగ్గి సూర్యుడి కిరణాల్లో వేడి పెరిగే కాలం .. అందుకే సంక్రాంతి అంతులేని సంబరాన్ని మోసుకొస్తుంది. అందుకే ప్రతిలోగిలిలో పొంగే కుండ ముగ్గు వేస్తారు. ఇంట్లో పాలు పొంగిస్తారు. 

సంబరమంతా ముగ్గులోనే
ఆడపిల్లల సంబరమంతా ఇంటి ముంగిట్లో ముగ్గులోనే కనబడుతుంది. ఎంతో సృజనాత్మకతను వెలికి తీసే పండుగగా చెప్పుకునే సంక్రాంతి వేళ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో సంక్రాంతి లక్ష్మికి స్వచ్ఛంగా ఆహ్వానం పలుకుతారు. ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు వాటి మీద గుమ్మడి పూలు, బంతిపూలు, చామంతి పూలతో అలంకరిస్తారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ దుస్తుల్లో ఆడపిల్లల ఆటపాటలు కన్నులపండువగా ఉంటాయి.  

Also Read: ఈ రాశులవారిపై దేవగురువు అనుగ్రహం, అప్పులుండవ్ ఇక ఆదాయమే!

కుండలు పంచుకునే సంప్రదాయం
కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగలో కుండలు పంచుకునే సంప్రదాయం కూడా పాటిస్తారు. ఆ కుండలో పొట్లకాయ, చెరకు, నువ్వులు, బెల్లం, శనగపప్పు, పసుపు, కుంకుమ నింపి గిన్నె రూపంలో బహుమతిగా ఇస్తారు. మకర సంక్రాంతి నుంచి రథ సప్తమి వరకు ఇంటింటికి వెళ్ళి, పెద్దలు, ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమలతో తాంబూలాన్ని ఇచ్చే ఆచారం కూడా ఉంది. పండుక వేళ ఇంటికి వచ్చిన ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి నుదిటిన బొట్టుపెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలని చెబుతారు.  ఆనందాల సిరులు కురిపించే పొంగలి కుండ ఇంటి ముందు వేయడం ద్వారా ఆ ఇంట సిరులు పొంగుతాయని, ఇల్లంతా ఆనందాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. 

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

మట్టికుండలో పెరుగు నింపి దానం ఇస్తారు
సంక్రాంతి రోజు కొన్ని ప్రాంతాల్లో... బ్రహ్మణులని ఆహ్వానించి  ఇంటిలో ఆసనం వేసి కాళ్లుకడిగి  నువ్వులతో నిండిన కంచుపాత్రలను దానం చేస్తారు . ఈ పాత్రకు తిలా పాత్ర అని పేరు. వీలైతే రాగి పాత్రలు, ఇత్తడి కుందులు, గొడుగులు ఇవ్వవచ్చు. ఈ మకర సంక్రాంతి రోజు మట్టి కుండలలో పెరుగును నింపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, దీని వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు దానం చేస్తే ఆ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారని నమ్మకం. నందుని భార్య యశోద   పెరుగు దానం చేసినందువలనే శ్రీ కృష్ణుడు కొడుకుగా లభించాడు. ద్రోణాచార్యుని  భార్య కృపి దుర్వాసమహామునికి ఈ విధంగా కుండలో నింపిన పెరుగును దానం చేసినందువల్ల ఆమెకు అశ్వత్థాముడు జన్మించాడని చెబుతారు.

Also Read: ధనస్సులోకి శుక్రుడు, 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Embed widget