Horoscope Today 25th February 2025: ఈ రాశులవారు ఆస్తులు కొనుగోలు అమ్మకాల్లో మంచి లాభాలు పొందుతారు
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 25 రాశిఫలాలు
మేష రాశి
ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. ఏదైనా తీవ్రమైన సమస్యను తండ్రి లేదా గురువులతో చర్చిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్య ఉండొచ్చు.
వృషభ రాశి
అనవసరమైన ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. చేస్తున్న పనిలో భంగం కలిగించే అవకాశం ఉంది. మీరు ఆధ్యాత్మిక ఆలోచనకు సమయం ఇస్తారు. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితం పొందుతారు.
మిథున రాశి
మీ ప్రియమైనవారికి సమయం కేటాయించడం మంచిది. రాజకీయాలతో సంబంధం ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. అనైతిక చర్యలకు పాల్పడవద్దు. డబ్బుకి సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి
Also Read: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!
కర్కాటక రాశి
ఈ రోజు మీ దినచర్య కొంచెం అసాధారణంగా ఉండవచ్చు. మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. వివాదాలను పరిష్కరించగలరు. ఇంటికి అనుకోని అతిథులు రావొచ్చు. మీరున్న రంగంలో సానుకూల ఫలితాలు సాధిస్తారు.
సింహ రాశి
ఈ రోజు మీరు ఇతరులకు సహాయం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇంటి వాతావరణం క్రమశిక్షణతో ఉంటుంది. ప్రతికూల అలవాట్లను విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. మీ ప్రణాళికలను బహిర్గతం చేయొద్దు. మీ అమాయకత్వాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.
కన్యా రాశి
ఈ రోజు మీ సామర్థ్యాన్ని మీరు విశ్వశించండి. సోమరితనంతో సమయాన్ని వృథా చేయవద్దు. వ్యాపారం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ప్రేమ సంబంధాల గురించి కొంచెం తీవ్రంగా ఉంటాయి. వాతావరణంలో మార్పుల ప్రభావం మీపై ఉంటుంది. రుణ లావాదేవీలతో కొంత సమస్య ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తులు కొనుగోలు, అమ్మకాలలో లాభం పొందుతారు. ప్రత్యర్థుల నుంచి విమర్శలు పడాల్సి ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు వెతుకుతారు.
Also Read: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఆనందంగా ఉంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధువుల నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. పని ఏకాగ్రత పెరుగుతుంది. మీరు మీ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు.
ధనస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులు ఉద్యోగం గురించి కొంత ఆందోళన చెందుతారు. చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. వ్యర్థ ఖర్చు చేయకుండా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కళా ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద అవకాశాలను పొందవచ్చు.
మకర రాశి
మీరు ఉత్తేజకరమైన పనులపై ఆసక్తి చూపిస్తారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రస్తుత పనులపై శ్రద్ధ వహించండి. భవిష్యత్తు కోసం ప్లాన్ చేయవద్దు. మీరు ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు..అప్రమత్తంగా ఉండాలి.
కుంభ రాశి
మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయొచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. భూమికి సంబంధించిన వ్యవహారాలు అడ్డం తిరుగుతాయి. చిన్న విషయాలపై ఎక్కువ దూకుడుగా ఉండకండి. జీవిత భాగస్వామితో సంబంధాలు ప్రభావితమవుతాయి.
Also Read: నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు..చిదానందరూపాన్ని శివుడిని!
మీన రాశి
ఈ రాశివారు ప్రేమ వివాహం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. దీర్ఘకాలికన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆహారాన్ని చాలా సమతుల్యంగా ఉంచండి. అన్ని పనులు సరైన సమయంలో పూర్తవుతాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

