అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ పేరు మారుతుందా? న్యూమరాలజీని నమ్ముకుంటున్న ఐకాన్ స్టార్... కారణం ఇదేనా?

Allu Arjun : 'పుష్ప 2' మూవీతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ త్వరలోనే తన పేరు మార్చుకోబోతున్నారు అనే వార్త చక్కర్లు కొడుతోంది. న్యూమరాలజీ ప్రకారం అల్లు అర్జున్ కొత్త పేరు ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీతో నటుడిగా ఆయన ఎంతోమంది హృదయాలను గెలుచుకోవడమే కాకుండా లెక్కలేనన్ని రికార్డులను బద్దలు కొట్టారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెక్స్ట్ రానున్న బడా సినిమాలకు ఒక బిగ్ టార్గెట్ ని ఛాలెంజ్ గా ఇచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడు అన్న విషయంపై జోరుగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బన్నీ న్యూమరాలజీ ప్రకారం తన పేరును మార్చుకోబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 

అల్లు అర్జున్ కొత్త పేరు ఇదే  

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ ప్రకారం అల్లు అర్జున్ తన పేరును మార్చుకునే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. అయితే బన్నీ తన పేరును మార్చుకోవడానికి న్యూమరాలజీని నమ్ముకుంటున్నారని తెలుస్తోంది. న్యూమరాలజీ సూచనల ప్రకారం తన పేరులోని ప్రస్తుత స్పెల్లింగ్ లో రెండు U లు, రెండు N లను యాడ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే అల్లు అర్జున్ కొత్త పేరు Alluu Arjunn కొత్త పేరు అవుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

నిజానికి అల్లు అర్జున్ 'పుష్ప 2' వివాదంలో చిక్కుకున్నప్పటి నుంచి ఆయన తన పేరును మార్చుకోబోతున్నారనే రూమర్లు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. టాలీవుడ్ గర్వపడే రేంజ్ లో 'పుష్ప 2' ఆడినప్పటికీ, ఈ వివాదం కారణంగా అల్లు అర్జున్ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకే ఆయన జాతకం ప్రకారం తన పేరును మార్చుకోబోతున్నారని రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఆయన తన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే బన్నీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ. 

అల్లు అర్జున్ బర్త్ డే రోజు నెక్స్ట్ మూవీ అప్డేట్ 

ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు బడా ప్రాజెక్టును లైన్ లో పెట్టారు. అందులో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి 'AA 22' అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ కోసం బన్నీ ఏకంగా రూ. 170 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరో పౌరాణిక సినిమాలో నటించబోతున్నారు. ఇందులో ఆయన కార్తికేయుడు పాత్రను పోషించబోతున్నారని అంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత 'పుష్ప' ఫ్రాంచైజీలో సుకుమార్ డైరక్షన్ లో మూడో భాగాన్ని అల్లు అర్జున్ పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?

వీడియోలు

అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Kajal Aggarwal : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
Embed widget