Court OTT Release: ఓటీటీలోకి బిగ్గెస్ట్ హిట్ 'కోర్ట్' మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Court OTT Release On Netflix: నాని సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. సంచలన విజయం సాధించిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Priyadarshi's Court Movie OTT Release Date Locked: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' (Court). మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
పోక్సో యాక్ట్ ప్రధానాంశంగా కోర్ట్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఈ నెల 11 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుందని సినీ వర్గాల టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఈ మూవీకి కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా.. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, 'శుభలేఖ' సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. మంగపతిగా విలన్ రోల్‌లో శివాజీ నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు.
Also Read: తెలుగు, తమిళ్‌లో హిట్... హిందీలో ఫట్... ఈ వారమే ఓటీటీలో స్టార్ కిడ్స్ సినిమా స్ట్రీమింగ్
స్టోరీ ఏంటంటే?
పోక్సో యాక్ట్‌పై అవగాహన కల్పించడం సహా చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ అదే ప్రధానాంశంగా 'కోర్ట్' బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. 2013 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ యువకుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. ఓ ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా పేరు, డబ్బు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. పరువు, ప్రతిష్టలే ప్రాణంగా భావించే ఆ అమ్మాయి ఇంట్లో ఈ విషయం తెలిసి ఆమె మామయ్య యువకునిపై కేసులు పెట్టిస్తాడు. కఠినమైన పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి జైలుకు వెళ్లేలా చేస్తాడు.
ఈ క్రమంలో యువకుని కుటుంబం తీవ్ర వేదనకు గురవుతుంది. పేదింటి నుంచి వచ్చిన యువకుని తరఫున వాదించేందుకు ఏ లాయర్ సాహసం చేయడు. ఇదే సమయంలో వీరికి ఓ యువ లాయర్ అండగా ఉంటాడు. తన కంటే పెద్ద లాయర్స్‌ను ఎదిరించి మరీ యువకుని తరఫున వాదిస్తాడు. ఇంతకూ ఆ యువకునికి న్యాయం జరిగిందా..?, ఈ కేసుల నుంచి యువకుడు ఎలా బయటపడ్డాడు.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
రికార్డు స్థాయిలో వసూళ్లు
నేచురల్ స్టార్ నాని సమర్పించిన ఈ మూవీని దాదాపు రూ.10 కోట్లతో నిర్మించగా.. దాదాపు రూ.55 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అటు ఓవర్‌సీస్‌లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడం విశేషం. ఓటీటీ రైట్స్, మ్యూజికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

