SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Terror Attack: నేడు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో చీర్ గర్ల్స్ ఉండరు. మ్యాచ్ లో ఆటగాళ్లు, అంపైర్లు, సిబ్బంది నల్ల రిబ్బన్ ధరించి బరిలోకి దిగుతారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. అమాయక ప్రజలపై జరిగన ఉగ్రదాడిని ఖండించిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి పహల్గాం ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించనున్నారు.
దాంతో పాటు ఈరోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటించనున్నారు. మరో కీలక నిర్ణయం ఏంటంటే.. ఈ రోజు మ్యాచ్‌లో చీర్ లీడర్లు ఉండరు, చీరింగ్ లేకుండానే మ్యాచ్ జరగనుందని బిసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు, మ్యాచ్ ముగిసిన తరువాత.. కొన్ని కీలక సందర్భాలలో చేసే ఫైర్ క్రాకర్స్ ఈరోజు కనిపించవు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడిలో చనిపోయిన వారికి నివాళిగా బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవల ముంబై ఇండియన్స్ తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. మరి నేడు సొంతగడ్డపై అయినా సత్తా చాటుతుందా, రివేంజ్ తీర్చుకుని ప్లే ఆఫ్ ఆశలను సీజవంగా నిలుపుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన జట్టు ముంబై ఇండియన్స్, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆతిథ్య సన్‌రైజర్స్ ను ఢీకొడుతుంది.
ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు వీరే..
Here's your guide for today's game, Orange Army! 📒
— SunRisers Hyderabad (@SunRisers) April 23, 2025
See you soon 🧡#PlayWithFire | #SRHvMI | #TATAIPL2025 pic.twitter.com/f4EKtqqxxf
సూర్యకుమార్ యాదవ్: మిస్టర్ 360 భారత వెర్షన్ గా పేరుంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడుగా సూర్య ఉన్నాడు. సూర్య వికెట్ త్వరగా తీయకపోతే ముంబైకి ఇబ్బంది తప్పదు.
జస్ప్రీత్ బుమ్రా: ఈ భారత ఫాస్ట్ బౌలర్ గురించి పరిచయం అవసరం లేదు. ఏ పరిస్థితిలోనైనా బౌలింగ్ తో మ్యాచ్ మలుపు తిప్పగల నైపుణ్యం అతడి సొంతం. ఈ రాత్రి హైదరాబాద్‌లో జరగనున్న మ్యాచ్ లో SRH బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
హెన్రిచ్ క్లాసెన్: దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ ఫాంతో సంబంధం లేకుండా పరుగులు సాధించడంలో దిట్ట. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అటు పేస్, ఇటు స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్ జట్టుకు ప్లస్ కానుంది.
అభిషేక్ శర్మ: భారత యువ బ్యాటింగ్ సంచలనం అభిషేక్ శర్మ ఓ పది ఓవర్ల వరకు క్రీజులో ఉంటే పరుగుల ప్రవాహం తప్పదు. ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంపై ఫోకస్ చేసే అభిషేక్ వికెట్లు కూడా అదే తీరుగా సమర్పించుకుంటాడు. శర్మ నిలిస్తే మ్యాచ్ నిలిచినట్లే.
తిలక్ వర్మ (MI): ఈ భారత బ్యాటింగ్ ఆల్ రౌండర్ స్టార్ గా మారే అవకాశం ఉంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఖాతాలో రెండు T20I సెంచరీలు ఉన్నాయి. డొమెస్టిక్ క్రికెట్‌లో తన సొంత మైదానంలో ఆడుతుండటం ప్లస్ పాయింట్ కానుంది.
ట్రావిస్ హెడ్: గత సీజన్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ తన జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మతో కలిసి మెరుపు ఆరంభాలు ఇస్తుంటాడు. పవర్ ప్లే వరకు వికెట్ నిలుపుకుంటే తరువాత సైతం అదే తీరుగా స్కోరు బోర్డును నడిపించగలడు.





















