అన్వేషించండి

CJI SuryaKant: నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే

న్యాయమూర్తి సూర్యకాంత్ 24 నవంబర్ న 53వ CJI గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370, మహిళా రిజర్వేషన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం (నవంబర్ 24) నాడు దేశ 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI) గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌లో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆయన జస్టిస్ బి.ఆర్. గవాయి స్థానంలో ఇటీవల సీజేఐగా నియమితులయ్యారు. నూతన సీజేఐ సూర్యకాంత్ ఫిబ్రవరి 9, 2027 వరకు పదవీకాలంలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో తన సుదీర్ఘ పదవీకాలంలో ఆయన అనేక ముఖ్యమైన, కీలక తీర్పులు ఇచ్చారు.

హర్యానాలోని హిస్సార్‌లో ఒక సాధారణ కుటుంబం 10 ఫిబ్రవరి 1962న జన్మించిన జస్టిస్ సూర్యకాంత్  దేశ అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత పదవికి చేరుకున్నారు. ఆయన హిస్సార్‌లో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. తరువాత పంజాబ్- హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ కొనసాగించారు. 2018లో ఆయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్ సూర్యకాంత్ 10 ముఖ్యమైన తీర్పులు

1. ఆర్టికల్ 370 పై చారిత్రాత్మక తీర్పు

జమ్మూ కాశ్మీర్‌‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసే నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ ఒకరు. ఈ తీర్పు గత కొన్ని సంవత్సరాలలో అత్యంత చర్చనీయాంశమైన రాజ్యాంగ నిర్ణయాలలో ఒకటి.

2. దేశద్రోహ చట్టంపై స్టే

సెక్షన్ 124A (దేశద్రోహం) పై స్టే విధించారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించే వరకు దానిని అమలు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించిన ధర్మాసనంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

3. పెగాసస్ స్పైవేర్ వివాదం

పెగాసస్ స్పైవేర్ కేసులో జస్టిస్ సూర్యకాంత్ విచారణ కోసం సైబర్ నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నవారిలో ఒకరు. జాతీయ భద్రత (National Security) పేరుతో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

4. బిహార్ ఓటర్ల జాబితా వివాదం

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఓటర్ల జాబితా (Bihar Voter List) నుండి తొలగించిన 65 లక్షల మంది పేర్ల పూర్తి వివరాలను బహిరంగపరచాలని ఆయన ఎన్నికల సంఘానికి ఆదేశించడం తెలిసిందే.

5. మహిళల హక్కులు, స్థానిక సంస్థల పాలన

ఒక మహిళా సర్పంచ్‌ను పదవి నుండి తొలగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆమె పదవిని జస్టిస్ సూర్యకాంత్ పునరుద్ధరించారు.  మహిళలపై వివక్షతను అంగీకరించలేమని తన తీర్పులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో సహా అన్ని బార్ అసోసియేషన్లలో 1/3 సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని సూచించారు. ఇది ఒక చారిత్రాత్మక చర్యగా పరిగణిస్తారు.

6. గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై పరిశీలన

ఇటీవల గవర్నర్, రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని విషయాల్లో ప్రశ్నలు లేవనెత్తున్నాయి. గవర్నర్, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన ముఖ్యమైన కేసులను విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఒకరు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది.

7. ప్రధాని మోదీ భద్రతా లోపంపై విచారణ

2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం తలెత్తింది. దీనిపై జస్టిస్ ఇందు మల్హోత్రా అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.

8. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP)

వన్ ర్యాంక్-వన్ పెన్షన్ OROP పథకానికి ఆయన రాజ్యాంగపరమైన గుర్తింపు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.

9. మహిళా హక్కులపై బలమైన వైఖరి

న్యాయ వృత్తి, సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కాలాన్ని బట్టి అవసరమని, కాబట్టి బార్ అసోసియేషన్లలో రిజర్వేషన్లు అవసరమని ఆయన తన ప్రత్యేక తీర్పులో స్పష్టం చేశారు.

10. రణవీర్ ఇలాహాబాడియా కేసు

అవమానకరమైన, తీవ్ర వ్యాఖ్యలపై పాడ్‌కాస్టర్ రణవీర్ ఇలాహాబాడియాను జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే సామాజిక మర్యాదలను ఉల్లంఘించే హక్కు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

న్యాయ సంస్థలలో ముఖ్యమైన పాత్ర

జస్టిస్ సూర్యకాంత్ అనేక జాతీయ, అంతర్జాతీయ న్యాయ సంస్థలకు సహకరించారు. ఆయన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నారు. వివిధ న్యాయ కమిటీలలో జస్టిస్ సూర్యకాంత్ చురుకైన పాత్ర పోషించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget