RR Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ పై అదిరే ట్విస్టు.. టికెట్లు ఇవ్వలేదని ఫిక్సింగ్ ఆరోపణలు..! ఆర్సీఏ కన్వీనర్ పై రాయల్స్ కన్నెర్ర
2016-17లో ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్తాన్ రాయల్స్ ను రెండేళ్ల పాటు బీసీసీఐ నిషేధించింది. ఇక తాజాగా రాయల్స్ చెత్త ప్రదర్శన చేస్తుండటంతో మరోసారి ఫిక్సింగ్ ఆరోపలు వెలుగు చూశాయి.

RR VS RCA VS BCCI: రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వెనకాల ఆసక్తికర పరిణామాలు ఉన్నాయని తెలుస్తోంది. తమకు తగినన్ని టికెట్లు ఇవ్వనందునే ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేసినట్లు సమాచారం. రాయల్స్ ఆడిన చివరి రెండు మ్యాచ్ ల్లో చివరి ఓవర్ లో 9 పరుగులు చేయలేక చతికిల పడింది. డిల్లీ క్యాపిటల్స్ చేతిలో సూపర్ ఓవర్లో ఓడగా, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 2 పరుగులతో పరాజయం పాలైంది. గతంలో కూడా ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు సస్పెన్షన్ కు గురైన రాయల్స్.. ఈ ప్రదర్శనతో మరోసారి క్రికెట్ ప్రేమికులకు అలజడికి గురి చేసింది. దీనికి తోడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. అయితే ఆరోపణలు చేసిన రాజస్థాన్ క్రికెట్ సంఘం అడ్ హక్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహాని వ్యక్తిగత స్వార్థంతోనే ఈ పనికి పాల్పడినట్లు ఫ్రాంచైజీ అధికారి ఒకరు స్పందించారు. ఈ ఏడాది ఆర్ సీఏను రద్దు చేయగా, ప్రస్తుతం రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ తో కలిసి ఐపీఎల్ ను రాయల్స్ నిర్వహిస్తోంది.
BCCI dismissed the match-fixing allegations against RR which earlier claims made by RCA pic.twitter.com/95NqkJ1Y88
— RVCJ Media (@RVCJ_FB) April 23, 2025
టికెట్లలో కోత..
గతంలో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు 1800 వరకు కాంప్లిమెంటరీ టికెట్లను రాయల్స్ ఇచ్చేది. అయితే ఈ ఏడాది ఆర్ సీఏ రద్దు కావడం, రాజస్తాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెగాటోర్నీ జరగడం, ఆర్సీఏ అడ్ హక్ కమిటీ ఉండటంతో కాస్త గందరగోళం నెలకొంది. అలాగే బీసీసీఐ సూచన మేరకు ఈసారి కేవలం 1000-1200 టికెట్లను మాత్రమే ఆర్సీఏ బాధ్యులకు రాయల్స్ అందజేసింది. దీనిపై గుర్రుగా ఉన్న వారంతా, బిహానీ నాయకత్వంతో అరోపణలకు సిద్దపడినట్లు తెలుస్తోంది.
Match-Fixing Allegation Alert 🚨
— ManasV (@ManasV_) April 22, 2025
Rajasthan Royals are under fire after a dramatic 2-run loss to Lucknow Super Giants, sparking match-fixing accusations.
Jaideep Bihani, convenor of the RCA ad hoc committee and BJP MLA from Sri Ganganagar, has alleged foul play, stating, "Even a… pic.twitter.com/tOqFV3r9ju
లీగ్ కు నష్టం..
తమ స్వార్థం కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్, రాయల్స్ మాతృసంస్థ, బీసీసీఐకి నష్టం కలుగుతుందని రాయల్స్ యాజమాన్యం మండిపడుతోంది. త్వరలోనే ఆర్సీఏకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇక ఆటలో పారదర్శకత కోసం 24/7 పాటు బోర్డు అవినీతి నిరోధక శాఖ పని చేస్తోందని, ఫిక్సింగ్ జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవని, ఇలాంటి చౌకబారు బహిరంగ ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఇక ఈ సీజన్ లో మాజీ చాంపియన్ రాయల్స్ ఎనిమిది మ్యాచ్ లు ఆడి, కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆరింటిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.




















