India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
గౌహతి టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడో సెషన్‌లో భారత జట్టు 81వ ఓవర్లో కొత్త బంతిని తీసుకోవడంతో భారత్ కం బ్యాక్ చేయగలిగింది. ఎందుకంటే ఆ తరువాతి ఓవర్లో మహ్మద్ సిరాజ్ వికెట్ తీశాడు.
దక్షిణాఫ్రికాకు మంచి స్టార్ట్ లభించింది. కెప్టెన్ టెంబా బవుమా 41 పరుగులు చేయగా, మార్‌క్రమ్ 38, మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 35 పరుగులు చేశారు. టోనీ డె జోర్జి 28 పరుగులకు సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రెండు సెషన్లు సఫారీలే ఆధిపత్యం చెలాయించారు. అయితే మూడో సెషన్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి వికెట్లు తీశారు. మూడో సెషన్‌లో 3 వికెట్లు తీసిన బౌలర్లు మొదటి 2 సెషన్లలో కేవలం 2 వికెట్లు తీయగా తీశారు.
రెండో టెస్టులో తొలిరోజు కుల్దీప్ యాదవ్ ఆకట్టుకున్నాడు. 3 కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.





















