AP 10th Results 2025: టెన్త్ ఫలితాల్లో సంచలనం, తొలిసారిగా 600కు 600 మార్కులు- ఆమె ఎవరంటే
AP SSC Results 2025 Toppers List | ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణత శాతం 80కి పైగా నమోదు కాగా, ఓ విద్యార్థినికి 600కు గానూ 600 మార్కులు వచ్చాయి.

కాకినాడ: ఏపీ పదో తరగతి ఫలితాలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. నేడు విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని చరిత్ర సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని ఏకంగా 600 మార్కులకుగానూ 600 స్కోర్ చేసింది. ఏపీ చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా నేహాంజని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆమె కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని అని సమాచారం. అయితే ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు వంద మార్కులు రావడం, మొత్తానికి వంద శాతం మార్కులు సాధించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
మరోవైపు ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులతో సత్తా చాటింది. ఆమె ఎలమంచిలిలోని చైతన్య స్కూల్‌లో చదివినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినికి 598 మార్కులతో దుమ్మురేపింది. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదివిన పావని చంద్రిక అనే విద్యార్థిని కేవలం 2 మార్కులు మాత్రమే కోల్పోయింది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివి స్టేట్ ర్యాంక్ మార్కులు తెచ్చుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలలో 81.14 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. టెన్త్ క్లాస్ పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అధికారిక వెబ్‌సైట్ లో, ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఏపీ టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ మన మిత్ర యాప్ ద్వారా సైతం ఫలితాలు తెలుసుకోవచ్చు.
- Send “Hi” to 95523 00009 on
- Click “Choose Service” (or “సేవను ఎంచుకండి”).
- Select “Education Services” (or “విద్యా సేవలు”).
- Choose “SSC March 10th Class - Results”.
- Enter your Hall Ticket Number and Date of Birth.
Click “Confirm” to receive the results on your WhatsApp






















