Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Crime News: అరెస్టు అయిన అఘెరి ఆడో, మగో తేల్చేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ కావడంతో సంగారెడ్డి జైల్లోకి అనుమతించలేదు.

Medical tests For Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారుల షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్ లో ఉంచలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు.. మెడికల్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమంటూ చెప్పిన జైలు అధికారులు తేల్చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరపాల్సి ఉంది.
లింగ నిర్దారణ పరీక్షలు చేయించిన పోలీసులు
అంతకు ముందు సంగారెడ్డి సమీపంలోని కంది సబ్ జైలు లో అఘోరీ శ్రీనివాస్ హంగామా సృష్టించాడు. తాను పెళ్లి చేసుకున్న వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు. అరుపులు కేకలతో హంగామా సృష్టించాడు. చంచల్ గూడ జైలు లో ట్రాన్స్ జండర్లకు ప్రత్యేక బ్లాక్ ఉంది. దీంతో వైద్యుల నివేదిక ఆధారంగా చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
పూజల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి పది లక్షలు వసూలు
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .
మహిళ ఫిర్యాదుతో కేసు -యూపీలో అరెస్ట్
క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది. చివరికి మోసం చేసినట్లుగా తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వర్షిణి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు
వర్షిణి తల్లిదండ్రులు, అన్నలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వర్షిణినీ అఘోరి శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అతని చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించాలని బాధితులు కోరారు. ' ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకున్న శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరిగా మారి తెలుగు రాష్ట్రాల్లో అలదడి రేపడం ప్రారంభించాడు. కారులో పుర్రెబొమ్మలు లాంటివి పెట్టుకుని తిరుగుతున్నాడు. కొంత మంది అమ్మాయిల్ని కూడా ట్రాప్ చేయడం కలకలం రేపుతోంది.





















