Prakash Raj: ప్రకాష్ రాజ్ గారూ... మీరెక్కడ? మీ 'జస్ట్ ఆస్కింగ్'కి ఏమైంది? పహల్గాం ఉగ్రదాడిపై స్పందించరే?
Pahalgam Terrorist Attack: కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పహల్గాం ఉగ్రదాడిని చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఖండించారు. అయితే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందన కోసం నెటిజనులు కొందరు ఎదురు చూస్తున్నారు.

కుల మతాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా పహల్గాంలో ముష్కరులు జరిపిన ఉగ్రదాడిని ఖండిస్తున్నారు (Pahalgam Terrorist Attack). అయితే... విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఎక్కడ? అని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ గారూ...
జస్ట్ ఆస్కింగ్ ఏమైంది?
ప్రకాష్ రాజ్ సెక్యులరిస్టు. తనను తాను లౌకికవాదిగా ఆయన చెప్పుకోవడం మాత్రమే కాదు... పలు సందర్భాలలో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ముస్లింలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి. 'జస్ట్ ఆస్కింగ్' (Just Asking) అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పలుమార్లు ప్రశ్నించారు.
సనాతన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాలలో ప్రకాష్ రాజ్ వ్యతిరేకించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సైతం ఆయన వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు ముష్కరుల ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన ఎందుకు స్పందించడం లేదని నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన శైలిలో 'జస్ట్ అస్కింగ్' అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Also Read: ప్రభాస్ సినిమాకు పహల్గాం టెర్రర్ ఎటాక్ సెగ... ఆ హీరోయిన్‌ను తీసేయాలని డిమాండ్!
Sir @prakashraaj
— Aakashavaani (@TheAakashavaani) April 23, 2025
What Happened To Your #JustAsking?
పాలస్తీనాలో ఘర్షణల సమయంలో ట్వీట్స్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఆయన పాత ట్వీట్స్ పైకి తీస్తున్నారు.
#PahalgamTerroristAttack #Justasking https://t.co/LsVK1H5Dgl pic.twitter.com/VgQYHLkR8X
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 23, 2025
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మతం పేరుతో విచక్షణ రహితమైన మారణకాండ జరిగిందని ప్రాథమిక సమాచారం అందుతోంది. పర్యాటకుల పేరుతో పాటు మతాన్ని కనుక్కొని, కొందరు పురుషుల ప్యాంట్ విప్పించి మరి చంపారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందించడం లేదు? ఆయన 'జస్ట్ ఆస్కింగ్'కి ఏమైంది? ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నారు? ఉగ్రదాడి మీద ఎందుకు స్పందించడం లేదు? వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ప్రకాష్ రాజ్ ఎప్పుడు బదులు ఇస్తారో చూడాలి. ప్రకాష్ రాజ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని కొందరు, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో ఎందుకు స్పందించడం లేదని ఇంకొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
What else you can expect from a Secular Hindu/Left wing/Congress eco system i.e. Internal terr01sts of India. Sorry its not peaceful community who are killed, so he is not gonna ask anything. Instead will do #FreeUmarKhalid
— Mastikhor 🤪 (@ventingout247) April 23, 2025
So #JustAsking only works when it fits your narrative?
— Anil Kumar Reddy (@Wealth_crafter) April 23, 2025
Where’s that loud voice when it comes to national security?
Convenient silence doesn’t go unnoticed.#PrakashRaj #DoubleStandards #Accountability pic.twitter.com/ySJV9cBacs






















