అన్వేషించండి

Bellamkonda Sreenivas : పెళ్లికి రెడీ అవుతోన్న బెల్లంకొండ శ్రీనివాస్? - అమ్మాయి ఎవరో తెలుసా?

Bellamkonda Sai Sreenivas : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లికి రెడీ అవుతున్నారు. కొన్నేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉండగా... త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

Bellamkonda Sreenivas To Engagement With His Girl Friend Kavya Reddy : శుభ ముహూర్తాల వేళ టాలీవుడ్‌లో హీరోల పెళ్లి సంబరాలు సందడిగా జరుగుతున్నాయి. మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఫేమస్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకు, యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ వివాహానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వధువు ఎవరంటే?

కావ్యా రెడ్డి అనే అమ్మాయితో గత కొన్నేళ్లుగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురి ప్రేమ విషయం ఇంట్లో తెలియగా... పెద్దల అంగీకారంతో ఈ నెల 8న ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

వధువు కావ్యా రెడ్డిది కూడా హైదరాబాదే. ఇండస్ట్రీతో ఈమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె తండ్రి న్యాయమూర్తి కాగా తండ్రి లాయర్‌గా చేస్తున్నారు. వీరి పరిచయం ఎప్పుడు ఎలా జరిగిందో తెలియకపోయినా పెద్దలను ఒప్పించి మరీ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఏడాది చివరిలో పెళ్లి ఉండే అవకాశం ఉండగా... ఎంగేజ్మెంట్ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read : అల్లు శిరీష్, నయనికల వెడ్డింగ్ - వివాహ వేదిక, శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వివాహంతో ఇండస్ట్రీలో పెళ్లి సందడి మొదలైంది. అల్లు అర్జున్ సోదరుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహం కూడా శుక్రవారం (మార్చి 6) హైదరాబాద్‌లో జరగనుంది. వీరిది కూడా ప్రేమ వివాహమే. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ప్రేమ పెళ్లికి రెడీ అయిపోయాడు.

'అల్లుడు శీను' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి మూవీస్ చేశారు. అటు, ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతేడాది భైరవం, కిష్కింధపురి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు.

అప్‌కమింగ్ మూవీస్

  • ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా 'హైందవ' తెరకెక్కుతోంది. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు.
  • దీంతో పాటే లోకమాన్య దర్శకత్వంలో 'రామమ్' మూవీ చేస్తున్నారు. ఇందులో అకీరాగా కనిపించనున్నారు. దోనెపూడి సమర్పణలో చిత్రాలయం బ్యానర్‌పై దోనెపూడి వేణు నిర్మిస్తున్నారు. 'ది రైజ్ ఆఫ్ అకీరా' అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది.
  • అలాగే, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు'లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. చేతిలో గన్, వెనుక సైన్యం యుద్ధం చేస్తున్న వారియర్‌గా ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dacoit Review : డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
Lukkhe Series OTT : రాశీ ఖన్నా ఫుల్ యాక్షన్ మోడ్ - న్యూ వెబ్ సిరీస్ 'లుక్కే'యండి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రాశీ ఖన్నా ఫుల్ యాక్షన్ మోడ్ - న్యూ వెబ్ సిరీస్ 'లుక్కే'యండి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Thalapathy Vijay : జన నాయగన్ రిలీజ్, లీక్ ఇష్యూస్ - మేకర్స్ కోసం దళపతి విజయ్ కీలక నిర్ణయం!
జన నాయగన్ రిలీజ్, లీక్ ఇష్యూస్ - మేకర్స్ కోసం దళపతి విజయ్ కీలక నిర్ణయం!
NTR Neel Movie Update : ఎన్టీఆర్ నీల్ మూవీలో RRR బ్యూటీ! - విలన్ రోల్‌లో బాలీవుడ్ యాక్టర్?
ఎన్టీఆర్ నీల్ మూవీలో RRR బ్యూటీ! - విలన్ రోల్‌లో బాలీవుడ్ యాక్టర్?
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stalin Warning: దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
Andhra CCTV360: నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
Bihar CM Update: బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
Dacoit Review : డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
Chandrababu letter: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
Indian Parliament: భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Embed widget