Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?
Rashmika Mandanna Sister: విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా పెళ్లిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఉంది. ప్రతి పెళ్లి వేడుకల్లోనూ కనిపించింది. ఆ అమ్మాయి పేరు షిమన్. ఇంతకీ, ఆ చిన్నారి ఎవరో తెలుసా?

Who Is Shiman Mandanna: షిమన్ మందన్నా... ఎవరీ అమ్మాయి? ఇటు ప్రేక్షకులు, అటు పరిశ్రమ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి వేడుకల్లో ఈ క్యూట్ అండ్ లిటిల్ గర్ల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇంతకీ, ఎవరీ అమ్మాయి? తెలుసుకోండి.
రష్మిక చెల్లెలు... షిమన్ మందన్నా
Rashmika Mandanna Sister Name: రష్మికా మందన్నాకు ఒక చెల్లెలు ఉంది. ఆ చిన్నారి పేరు షిమన్... షిమన్ మందన్నా. ఓసారి 'పుష్ప' షూటింగ్ డేస్ గుర్తు చేసుకుంటే... సోషల్ మీడియాలో రష్మిక చేసిన పోస్టుల్లో షిమన్ ఉన్న ఫోటోలు కనిపిస్తాయి. అయితే... అప్పుడు ఆమె మరీ చిన్నది. ఇప్పుడు కొంచెం పొడవు పెరిగారు. అందువల్ల గుర్తు పట్టడం కొంచెం కష్టమైంది.
రష్మిక కంటే వయసులో 16 ఏళ్ళు చిన్న
ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే... రష్మిక, షిమన్ మధ్య వయసులో వ్యత్యాసం. నేషనల్ క్రష్ కంటే ఆమె చెల్లెలు 16 ఏళ్ళ చిన్న. ఏప్రిల్ 5, 1996న రష్మిక జన్మించారు. ఆమెకు పెళ్లి అయ్యే సమయానికి చెల్లెలు వయసు 14 ఏళ్ళు. మే 2, 2012న షిమన్ జన్మించారు.
చిట్టి చెల్లికి రష్మిక పెట్టిన ముద్దు పేరు తెల్సా?
రష్మికా మందన్నాకు చెల్లెలు అంటే చాలా ఇష్టం. చిట్టి చెల్లిని కన్న కుమార్తె కంటే ఎక్కువగా చూసుకుంటారు. 'లిటిల్ డాల్', 'లిటిల్ మంకీ' అంటూ షిమన్ (Shiman Mandanna)కు ముద్దు పేరు పెట్టారు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ... అక్క చెల్లెళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది. అక్క స్టార్ హీరోయిన్ అయినప్పటికీ... మీడియాకు దూరంగా ఉంటారు షిమన్ మందన్నా.
రష్మిక తల్లిదండ్రుల విషయానికి వస్తే... సుమన్ మందన్నా, మదన్ మందన్నాది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. రష్మిక తండ్రికి కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. అలాగే, సొంతూరిలో ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. రష్మిక తల్లి హోమ్ మేకర్. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు నేషనల్ క్రష్. ఇప్పుడీ కన్నడ అమ్మాయి తెలంగాణలోని దేవరకొండ ఇంటి కోడలు అయ్యారు.
ట్రెండింగ్ వార్తలు























