NTR Neel Movie: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్... నీల్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసిందోచ్
NTR Neel : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లోడ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం మేలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon Movie) అనే టైటిల్ ఖరారు చేసినట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. జనవరిలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా, ఎన్టీఆర్ ఇంకా షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. ఈ క్రమంలోనే మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అప్డేట్ లోడ్ అవుతుందనే ఒక క్రేజీ వార్త సినిమా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎన్టీఆర్ - నీల్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లోడింగ్
'దేవర' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ అదే జోష్ తో తన నెక్స్ట్ సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన చేస్తున్న ఫస్ట్ హిందీ మూవీ 'వార్ 2' షూటింగ్ చివరి దశకు చేరుకోగా, నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా అలా ఎదురు చూస్తున్న వారందరి కోసం ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు ఇచ్చిన సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ - నీల్ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు ఇప్పటికే మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఎన్టీఆర్ - నీల్ మూవీ ఫస్ట్ లుక్ ను మే 20న టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఎన్టీఆర్ సెట్లో అడుగు పెట్టేది అప్పుడేనా?
ప్రస్తుతం జపాన్లో 'దేవర' సందడి కొనసాగుతోంది. ఈ మూవీని అక్కడ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇటీవల ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి జపాన్ కి వెళ్లారు. అక్కడ మూవీ ప్రమోషన్స్ చేసిన ఆయన... ఇప్పటికే మూవీ రిలీజ్ కావడంతో త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీ సెట్ లో అడుగు పెట్టబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతోందని, ఏప్రిల్ మధ్యలో యంగ్ టైగర్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు ఫిలిం వర్గాల టాక్. అనంతరం ఎన్టీఆర్ మళ్లీ 'వార్ 2' షూటింగ్ కు షిఫ్ట్ కాబోతున్నారని అంటున్నారు. 'వార్ 2' సినిమాలో ఓ పాట, మరికొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా పైనే ఫోకస్ చేయబోతున్నారు.
ఇక మరోవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీలో అదిరిపోయే స్పెషల్ మాస్ బీట్ ఉండబోతుందని, అందులో బాలీవుడ్ హీరోయిన్ చిందులు వేయబోతోందని ప్రచారం జరుగుతుంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టోవినో థామస్, బిజూ మీనన్ ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.





















