అన్వేషించండి

Shivaratri Mangli Song 2025: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!

Maha Shivaratri special Song 2025: ఏటా శివరాత్రి సందర్భంగా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తుంది సింగర్ మంగ్లీ.. ఈ ఏడాది సాంగ్ వచ్చేసింది..

Shivaratri  Mangli Song 2025:  సినిమా పాటలు ఓవైపు జానపద, భక్తి పాటలు మరోవైపు..అన్నింటిలోనూ సింగర్ మంగ్లీ తనదైన ముద్ర వేసుకుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా స్పెషల్ సాంగ్స్ రిలీజ్ చేసే మంగ్లీ ఫిబ్రవరి 26 శివరాత్రి సందర్భంగా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాటను సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామ కాశీ విశ్వేశ్వర ఆలయంలో చిత్రీకరించారు.  జోడు కోడే ముగ్గులోడ శివయ్య అంటూ మొదలయ్యే ఈ పాట మొత్తం ఇక్కడ చూసేయండి. 

పాట ఇదే...
మూడు మూడు కన్నులోడా శివయ్య ముల్లోకపాలకుడా శివయ్య మా దేవాదిదేవా శంకరా
అడ్డ అడ్డ బొట్టువాడా శివయ్య అండపిండమైనవాడా శివయ్య అర్థనారీశ్వరుడా రావయ్య

వల్లకాడే ఇల్లునీకు భూతపాలుడా...వల్లకానిదంటూ ఏమిలేని సోమనాధుడా
వల్లుబూడిదల్లుపూసుకున్న దేవుడా..నల్లనాగు మెడన చుట్టుకున్న నీలకంఠుడా..
దయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...

గంగనెత్తినోడా శివయ్య...గౌరీదేవి మెచ్చినాడో శివయ్య ..గండాలు బాపేటోడా శంకరా
భయములేని భైరవుడా శివయ్య..గంభీరదేహమోడా శివయ్య.. బంభోలనాధుడా శంకరా

మోదుగ మొగ్గలిగ్గు శివయ్య..మారేడు రెమ్మలిద్దు శివయ్య..మనసుపెట్టి మొక్కుకుందూ శంకరా
లింగాన సెంబునీళ్లు పొయ్యంగ శరపమయ్య సేదులన్నీ శివయ్య..బాపవయ్య బాధలన్నీ శంకరా

నాగమల్లి పూలు నీకు నాగభరణుడు..తెల్లమల్లి అల్లె జిల్లేడు దెత్తు శివుడా
పాలకాయ గొడుగనయ్యా పాలనేత్రుడా.. పాహి పాహి అంటూ వేడుకుందు పాపహరణుడా
దయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...

జోడె కోడె మొక్కులోడా శివయ్యా.. జోలెపట్టె తిరిగెటోడా శివయ్యా..జోరు జోరు జంగముడా శంకరా
లావు లావు జడలవాడా శివయ్య..లావుకోపమేలనీకు శివయ్య.. లావుజాలి కురుపువాడా శంకరా..

ఎండి ఎండి కొండలాడా శివయ్య..చిత్తనైన కండలోడా శివయ్యా..ఎంతమంచి మనసునీది శంకరా
మేలి మేలి నవ్వులోడా శివయ్య..మేలితీరు లెంచెటోడా శివయ్య..తేడావస్తే ముంచెటోడా శంకరా

అంబరీష నందినీకు వాహనమ్ముగా.. అంబ పార్వతమ్మ తోడుగుండి నడిపినావుగా
గంగధరుడా నీది లీల చిత్రమేకదా ..లింగరూపములో లోకమంతా ఏలినోడా
దయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...

ఒట్టు జాడ తెలవనోడా శివయ్య పట్టువిడుపు తెలిసినోడా శివయ్య పట్టుబట్టలెరుగనోడా శంకరా
పంచభూత పాలకుడా శివయ్య పాపమెల్లమోసెటోడ శివయ్య నిన్నుమించె దైవమేల శంకరా

శూలమొక్క సేతబట్టి శివయ్య..ఢమరుకాలు మోతబెట్టి శివయ్య.. సృష్టిని కాపాడుతావు శంకరా
జింకతోలు మొలకుచుట్టి శివయ్య..కంచుగజ్జె కాళ్లగట్టి శివయ్య..  పరవశించి ఆడుతావు శంకరా
 
దిక్కుదీము నీవే భీమశంకరా..మొక్కుకున్నవారికెల్ల మోక్షమిచ్చినవారురా
ఒక్కపొద్దుఉంటే చాలు వెంట ఈశ్వర.. కోరుకున్న వరములిచ్చే భోళా శంకర
దయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...

అందు ఇందు ఏడ చూడు నువ్వయ్యా..అంతులేని చూపులోడా శివయ్య..అంతరంగమెరిగినోడా శంకరా
అందముల్లా చంద్రరూపం శివయ్య..అందుకోను ధూపదీపం నీవయ్య..రామసక్కని సోమ సుందరా..

స్పీకర్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు దాము రెడ్డి, సంగీత దర్శకుడు మదీన్ ఎస్.కె ఆధ్వర్యంలో రూపొందించిన పాట ఇది. ఈ సాంగ్ చిత్రీకరణలో మంగ్లీ సోదరి ఇంద్రావతి కూడా ఉంది.

గతంలో మంగ్లీ పాడిన శివుడి పాటలు ఇవే...

హరహర మహాదేవ శంకరా
హరహర మహాదేవ శంకరా
ఓ ఓ..! సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా

అండము నీవే పిండము నీవే
ఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే
సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా

 

ఎండి కొండాలు ఏలేటొడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా జగాలను గాసే జంగముడా జగమంతా నీదే కదరా జంగమా...జనమందరు పూజించే శివలింగమా...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget