Diwali Lakshmi Puja: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి - పూజా విధానం ఇదిగో ఫాలోఅయిపోండి!
Diwali Lakshmi Puja 2024: హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ రోజు లక్ష్మీపూజ చేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని విశ్వశిస్తారు. ఏ సమయానికి పూజచేయాలి? పూజా విధానం ఏంటి? ఇక్కడ తెలుసుకోండి
Diwali Lakshmi Puja Process: అక్టోబరు 31 నరకచతుర్థశి, దీపావళి వచ్చింది. ఈ రోజు సాయంత్రానికి అమావాస్య ఘడియలు ఉండడంతో దీపావళి ఈరోజు జరుపుకుంటారు. సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించే ముందు లక్ష్మీపూజ చేస్తారు. దీనికి ప్రత్యేకమైన ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వర్జ్యం,దుర్మూహుర్తం లేని ఘడియల్లో పూజ ఆచరిస్తే సరిపోతుంది. అక్టోబరు 31 గురువారం సాయంత్రానికి వర్జ్యం, దుర్మూహుర్తం లేవు..అందుకే సూర్యాస్తమయం కాగానే పూజ చేసుకోవచ్చు...
ఏ పూజ ప్రారంభించినా ముందుగా పసుపుగణపతి పూజ చేయాలి... ఈ పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ అనంతరం లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి...
మళ్లీ ఆచమనీయం చేసి కేశవనామాలు చెప్పుకోవాలి.
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ సూక్త విధనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ...( నీళ్లు ముట్టుకోవాలి)
ధ్యానం
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మ॒పత్రాయతాక్షీ
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా |
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మ॒ణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః |
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృ॒హే సర్వ॒మాంగళ్యయుక్తా||
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేన్ద్రగంగాధరాం |
త్వాం త్రై॒లోక్య కుటుంబినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధ్యాయామి |
ఆవాహనం
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ |
చన్ద్రాం హి॒రణ్మయీం ల॒క్ష్మీం జాతవేదో మ॒ ఆవహ ||
ఓం సర్వలోకస్యజననీం శూలహస్తాం త్రిలోచనామ్ |
సర్వదేవమయీమీశాం దేవీమావాహయామ్యహమ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆవాహయామి |
ఆసనం
తాం మ ఆవహ॒జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ ||
ఓం తప్తకాంచనవర్ణాభం ముక్తామణివిరాజితమ్ |
అమలం కమలం దివ్యమాసనం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
పాద్యం
అశ్వ॒పూర్వాం ర॑థమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ |
శ్రియం దేవీముప॑హ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ||
ఓం గంగాదితీర్థసమ్భూతం గంధపుష్పాక్షతైర్యుతమ్ |
పాద్యం దదామ్యహం దేవి గృహాణాశు నమోస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం
కాంసోస్మి॒తాం హిర॑ణ్యప్రాకారామార్ద్రాం
జ్వలన్తీం తృ॒ప్తాం తర్పయన్తీమ్ |
పద్మే॒ స్థితాం ప॒ద్మవర్ణాం తామిహోపహ్వయేశ్రియమ్ ||
అష్టగంధసమాయుక్తం స్వర్ణపాత్రప్రపూరితమ్ |
అర్ఘ్యం గృహాణ మద్దత్తం మహాలక్ష్మై నమోస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం
చ॒న్ద్రాం ప్రభాసాం య॒శసా జ్వలన్తీం
శ్రియం లోకే దే॒వజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శర॑ణమహం ప్రప॑ద్యే
ల॒క్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే ||
ఓం సర్వలోకస్య యా శక్తిః బ్రహ్మవిష్ణ్వాదిభిః స్తుతా |
దదామ్యాచమనం తస్యై మహాకాళ్యై మనోహరమ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మహాలక్ష్మీదేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి
శుద్ధోదకస్నానం
ఆ॒ది॒త్యవర్ణే॒ తప॒సోధిజాతో
వన॒స్పతిస్తవ వృ॒క్షోథ బి॒ల్వః |
తస్య ఫలాని తపసా నుదన్తు
మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మ॒హేరణాయ॒ చక్షసే |
యో వ: శి॒వతమో రసస్తస్య భాజయతే హ న: |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |
ఓం పంచామృత సమాయుక్తం జాహ్నవీసలిలం శుభమ్ |
గృహాణ విశ్వజనని స్నానార్థం భక్తవత్సలే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!
వస్త్రం
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్
కీర్తిమృద్ధిం దదాతు మే ||
ఓం దివ్యాంబరం నూతనం హి క్షౌమంత్వతిమనోహరమ్ |
దీయమానం మయా దేవి గృహాణ జగదంబికే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
మధుపర్కం
కాపిలం దధి కున్దేన్దుధవలం మధుసంయుతమ్ |
స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మధుపర్కం సమర్పయామి |
ఆభరణం
క్షుత్పిపాసామలాం జ్యే॒ష్ఠామలక్ష్మీం నాశయా॒మ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||
ఓం రత్నకంకణ వైఢూర్య ముక్తాహారాదికాని చ |
సుప్రసన్నేన మనసా దత్తని స్వీకురుష్వ భోః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆభరణాని సమర్పయామి |
గంధం, చందనం, పసుపు, కుంకుమ, పూలు
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే॒ శ్రియమ్ ||
శ్రీఖండాగరుకర్పూర మృగనాభిసమన్వితమ్ |
విలేపనం గృహాణాశు నమోఽస్తు భక్తవత్సలే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః చందనం సమర్పయామి |
ఓం రక్తచందనసమ్మిశ్రం పారిజాత సముద్భవమ్ |
మయాదత్తం గృహాణాశు చందనం గంధసంయుతం ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః రక్తచందనం సమర్పయామి |
ఓం సిందూరం రక్తవర్ణం చ సిందూరతిలకప్రియే |
భక్త్యా దత్తం మయా దేవి సిందూరం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సిందూరం సమర్పయామి |
కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణమ్ |
అఖండ కామసౌభాగ్యం కుంకుమ ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః కుంకుమం సమర్పయామి |
ఓం తైలానిచ సుగంధాణి ద్రవ్యాణి వివిధాని చ |
మయా దత్తాని లేపార్థం గృహాణ పరమేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సుగంధి తైలం సమర్పయామి |
మనస: కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్ర॑యతాం యశ: ||
ఓం మందారపారిజాతాదీన్పాటలీం కేతకీం తథా |
మరువామోగరం చైవ గృహాణాశు నమోస్తు తే |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పాణి సమర్పయామి |
ఓం విష్ణ్వాదిసర్వదేవానాం ప్రియాం సర్వసుశోభనమ్ |
క్షీరసాగరసంభూతే దూర్వాం స్వీకురు సర్వదా ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దుర్వాః సమర్పయామి |
Also Read: దీపావళికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా - దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!
పూల మాల
క॒ర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతర పద్మమాలినీమ్ ||
ఓం పద్మశంఖజపాపుష్పైః శతపత్రైర్విచిత్రితామ్ |
పుష్పమాలాం ప్రయచ్ఛామి గృహాణ త్వం సురేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పమాలామ్ సమర్పయామి |
అథాంగ పూజా
ఓం చపలాయై నమః – పాదౌ పూజయామి
ఓం చంచలాయై నమః – జానునీ పూజయామి
ఓం కమలాయై నమః – కటిం పూజయామి
ఓం కాత్యాయన్యై నమః – నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః – జఠరం పూజయామి
ఓం విశ్వవల్లభాయై నమః – వక్షస్స్థలం పూజయామి
ఓం కమలవాసిన్యై నమః – నేత్రత్రయం పూజయామి
ఓం శ్రియై నమః – శిరః పూజయామి
ఓం మహాలక్ష్మై నమః – సర్వాణ్యంగాని పూజయామి
అథ పూర్వాదిక్రమేణాష్టదిక్ష్వష్టసిద్ధీః పూజయేత్
ఓం అణిమ్నే నమః ఓం మహిమ్నే నమః ఓం గరిమ్ణే నమః
ఓం లఘిమ్నే నమః ఓం ప్రాప్త్యై నమః ఓం ప్రాకామ్యాయై నమః
ఓం ఈశితాయై నమః ఓం వశితాయై నమః
ధూపం
ఆప: సృ॒జన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే||
ఓం వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యస్సుమనోహరః |
ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధూపం సమర్పయామి |
దీపం
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గ॒లాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హి॒రణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం కర్పూరవర్తిసంయుక్తం ఘృతయుక్తం మనోహరమ్ |
తమోనాశకరం దీపం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దీపం సమర్పయామి |
నైవేద్యం
ఆ॒ర్ద్రాం య॒: కరిణీం య॒ష్టిం సువర్ణాం హేమమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మయీం ల॒క్ష్మీం జాత॑వేదో మ ఆవహ ||
ఓం నైవేద్యం గృహ్యతాం దేవి భక్ష్యభోజ్యసమన్వితమ్ |
షడ్రసైరన్వితం దివ్యం లక్ష్మీదేవి నమోఽస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువ: తత్సవితుర్వరేణ్య॒మ్ భర్గో॑ దేవస్యధీమహి |
ధియో యోన: ప్రచోదయాత్ ||
సత్యం త్వాఋతేన పరిషించామి
అమృతమస్తు | అమృ॒తోప॒స్తరణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా ఓం అ॒పా॒నాయ॒ స్వాహా ఓం వ్యా॒నాయ॒ స్వాహా
ఓం ఉదానాయ॒ స్వాహా ఓం స॒మా॒నాయ స్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి
ఉత్తరాపోషనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి
శుద్ధాచమనీయం సమర్పయామి |
శీతలం నిర్మలం తోయం కర్పూరేణ సువాసితమ్ |
ఆచమ్యతాం మమ జలం ప్రసీద త్వం మహేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆచమనీయం సమర్పయామి |
తాంబూలం
తాం మ ఆవహ జాతవేదో ల॒క్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం
గావో॑ దాస్యోశ్వా”న్వి॒న్దేయం పురుషాన॒హమ్ ||
ఓం ఏలాలవంగకర్పూరనాగపత్రాదిభిర్యుతమ్ |
పూగీఫలేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః తాంబూలం సమర్పయామి |
ఓం ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తస్మాత్ఫలప్రదానేన పూర్ణాస్సన్తు మనోరథాః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఫలం సమర్పయామి |
ఓం హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః |
అనంతపుణ్యఫలదం అతః శాన్తిం ప్రయచ్ఛమే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దక్షిణాం సమర్పయామి |
నీరాజనం
ఆనన్ద॒: కర్దమశ్చైవ చిక్లీత ఇతి॒ విశ్రుతాః |
ఋషయ: తేత్రయః పుత్రాః స్వయం శ్రీదేవీ దేవతా ||
ఓం చక్షుర్దం సర్వలోకానాం తిమిరస్య నివారణమ్ |
ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మంత్రపుష్పం
ఓం మహాదే॒వ్యై చవి॒ద్మహే విష్ణుప॒త్నీ చధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచో॒దయాత్ ||
ఓం కేతకీజాతికుసుమైర్మల్లికామాలతీభవైః |
పుష్పాంజలిర్మయాదత్తస్తవప్రీత్యై నమోస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి |