50 30 20 Rule : శాలరీని 50-30-20 రూల్‌తో ఎలా బ్రేక్ చేయాలి.. సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి
50-30-20 Rule for a Wealthy Life : తక్కువ జీతం వచ్చినా.. సేవింగ్స్ చేస్తూనే జీతాన్ని ఖర్చు చేయాలంటున్నారు ఆర్థిక నిపుణులు. దీనిలో భాగంగానే 50-30-20 రూల్‌ని తెరపైకి తీసుకువచ్చారు. అది ఏంటంటే..

Money Management Tips : సంపాదనలో అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలిన దానిని సేవింగ్స్ చేయాలని చాలామంది చూస్తారు. కానీ ఎప్పుడూ అలా అనుకోకూడదట. ఖర్చులతో పాటు.. సేవింగ్స్కి కూడా డబ్బును కేటాయించినప్పుడే ఫ్యూచర్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు నిపుణులు. దానిలో భాగంగా 50-30-20 రూల్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ రూల్ ఏంటి? దీనిని ఎలా ఫాలో అవ్వాలి. రానున్నరోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం.
50-30-20 రూల్
ఈ రూల్‌ని ఫాలో అవ్వాలంటే.. మీకు వచ్చే శాలరీ ఎంతో చూసుకోండి. జీతం నుంచి వ్యవసాయం నుంచి ఇతర బిజినెస్ల నుంచి వచ్చేది ఏదైనా.. అన్ని ట్యాక్స్‌లు పోయిన తర్వాత మీ చేతికి ఎంత వస్తుందో దానిని నోట్ చేసుకోవాలి. ఆ శాలరీని 50-30-20 రూల్‌లో భాగంగా మూడు భాగాలుగా చేయాలి. మీకు వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని కచ్చితమైన ఖర్చులకు, 30 శాతాన్ని మార్చుకోగలిగే ఖర్చులు, 20 శాతం సేవింగ్స్కి కచ్చితంగా వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. 25 వేల శాలరీ వస్తే ఈ రూల్‌ని ఎలా ఫాలో అవ్వొచ్చో.. ఉదాహరణతో చూసేద్దాం.
50-30-20 రూల్‌లో భాగంగా.. ముందుగా 20 శాతాన్ని సేవింగ్స్కోసం ముందుగా పక్కకి తీసేయాలి. అంటే 25,000 శాలరీలో 20 శాతాన్ని అంటే 5,000లను సేవింగ్స్కి మార్చేయాలి. మిగిలిన డబ్బుతోనే 50,30ని డివైడ్ చేయాలి. అన్ని చేసిన తర్వాత సేవింగ్స్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇది కూడా అత్యవసరమైన భాగంగానే మార్చుకోవాలి. అప్పుడే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులకు సరిపడా డబ్బులకోసం వేరే ఆదాయాలను ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుందని చెప్తున్నారు.
బేసిక్స్ (50 శాతం)
నెల నెల కచ్చితంగా ఖర్చు చేయాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి. వాటిలో అద్దెలు, ఈఎంఐలు, కరెంట్ బిల్, గ్యాస్, వాటర్ ఛార్జ్, స్కూల్ ఫీజులు, మెడికల్ ఇలా ఇల్లు గడవడానికి చేసే ఖర్చులకోసం 50 శాతం డివైడ్ చేయాలి. 25 వేలల్లో 50 శాతం అంటే 12,500 వస్తుంది. ఇవన్నీ దానిలోనే ముగించేలా అడ్జెస్ట్ చేసుకోవాలి.
మార్చుకోగలిగే ఖర్చులు (30 శాతం)
మొబైల్స్, టీవీ, నెట్, పెట్రోల్, డీజిల్ వంటి ఖర్చులు దీనిలోకి వస్తాయి. వీటిని మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. దీనిలో 7,500 ఉంటుంది కాబట్టి అడ్జెస్ట్ చేసి బేసిక్ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకానీ సేవింగ్స్‌ని ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు చాలావరకు తగ్గుతాయి. అయితే ఈ రెండిటీకన్నా.. సేవింగ్స్‌ని డివైడ్ చేయడం చాలా ముఖ్యం. డబ్బు ఎంత వచ్చినా.. సేవింగ్స్ మాత్రం కచ్చితంగా జరుగుతూనే ఉండాలి.
సేవింగ్స్(20 శాతం) ఇలా ప్లాన్ చేసుకోండి
20 శాతం సేవింగ్స్‌ని డబ్బును మూడు భాగాలుగా విభజించాలి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్‌గా డివైడ్ చేయాలి. మీ అవసరాలకు తగ్గట్లు లైఫ్ ఇన్సూరెన్స్‌ని కట్టొచ్చు. గవర్నెమెంట్ స్కీమ్స్ తక్కువ ఖర్చులో వచ్చేస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి కట్టినా సరిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీ కంఫర్ట్ బట్టి తీసుకోవచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ ఫండ్‌లో ఎప్పుడూ.. మూడు నుంచి 6 నెలల శాలరీ ఉండేలా చూసుకోండి. అంటే మీరు అన్ని నెలలు దానిలో డబ్బును వాడకూడదనమాట.
జాబ్ లేనప్పుడు, ఇతర అత్యవసరాల సమయంలో ఈ డబ్బు ఉపయోగపడుతుంది. లేదా మీకు వడ్డీ ఎక్కువగా పడుతున్న వాటిని ఈ మనీతో క్లియర్ చేసుకోవచ్చు. అలాగే నెల నెల తక్కువ మొత్తంలో ఆర్డీ, పిల్లలకోసం సపరేట్గా సుకన్య యోజన, పీపీఎఫ్, మీకోసం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇవి లాంగ్‌టర్మ్‌లో హెల్ప్ చేస్తాయి. మీ ఆదాయాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి.
ఇలా మీకు వచ్చే ఆదాయాన్ని 50-30-20 రూల్‌లో విడగొట్టాలి. శాలరీ వచ్చేది తక్కువైనా, ఎక్కువైనా.. ఈ తరహా ప్లానింగ్ ఉంటే మంచిది. అలాగే మీకు వివిధ కారణాల వల్ల కాస్త డబ్బు ఎక్కువగా వస్తే దానిని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే స్టాక్స్, మీకు ఆదాయాన్ని అందించే వాటిలో వీటిని ఉపయోగించుకోవచ్చు. మరి మీరు కూడా మీకు శాలరీ లేదా ఇతర ఆదాయం వచ్చినప్పుడు ఈ రూల్‌ని ఫాలో అయిపోయి.. వెల్తీ లైఫ్‌ని లీడ్ చేసేయండి.
Also Read : డబ్బులు, లక్ కలిసి రావాలంటే ఇంట్లో ఈ పెయింటింగ్స్ పెట్టుకోవాలి.. బుద్ధుడి బొమ్మని అక్కడ పెడితే మంచిదట
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

