అన్వేషించండి

Vastu Tips : డబ్బులు, లక్ కలిసి రావాలంటే ఇంట్లో ఈ పెయింటింగ్స్ పెట్టుకోవాలి.. బుద్ధుడి బొమ్మని అక్కడ పెడితే మంచిదట

Life Changing Paintings : మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? అయితే వాస్తుపరంగా మీకు కలిసి వచ్చే కొన్ని పెయింటింగ్స్​ని ఇంట్లో పెడితే చాలామంచిదంటున్నారు. అవి ఏంటంటే..

Vastu Paintings : ఇంటికి మంచి లుక్​ని ఇచ్చేందుకు, ఆర్ట్స్ అంటే ఇష్టమున్నావారు ఇంట్లో పెయింటింగ్స్ పెట్టుకుంటారు. మరికొందరు వాస్తును ఫాలో అవుతూ కొన్ని వస్తువులను ఇంట్లో డెకరేట్ చేస్తారు. అయితే మంచి లుక్​ని ఇవ్వడంతో పాటు.. వాస్తుపరంగా కూడా మేలు చేసే కొన్ని పెయింటింగ్స్ ఇక్కడున్నాయి. వాటిని ఇంట్లో ఏ వైపు పెడితే ఏయే రంగాల్లో అభివృద్ధి ఉంటుందో.. ఎలాంటి పెయింట్స్ వల్ల పాజిటివిటీ పెరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, ఆధ్యాత్మికతతో కూడిన పురాతన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం కొన్ని పెయింటింగ్​లు జీవితాలను ప్రభావితం చేస్తాయి అంటారు. దానికి అనుగుణంగానే చాలామంది ఇళ్లల్లో ఏడు గుర్రాలు, వాటర్ ఫాల్స్, నెమలి, తామర పువ్వు వంటి పెయింటింగ్స్ వేయించుకుంటారు. ఇంతకీ ఈ పెయింటింగ్స్ పెట్టుకుంటే కలిగే లాభాలు ఏంటో.. ఏ వైపు పెడితో లక్ కలిసి వస్తుందో తెలుసుకుందాం. 

ఏడుగుర్రాలు (Seven Running Horses) 

ఇంట్లో ఏడు గుర్రాలు పరుగెడుతున్న పెయింటింగ్ పెట్టుకుంటే చాలా మంచిదట. ఇది కెరీర్​లో ముందుకు వెళ్లడాన్ని, సక్సెస్​ని సూచిస్తుందట. దీనిని ఇంట్లో దక్షిణాన ప్లేస్ చేస్తే మంచిది. ఏనుగులు కూడా బలం, స్థిరత్వాన్ని సూచిస్తాయి. 

తామర పువ్వు (Lotus)

తామర పువ్వు స్వచ్ఛత, శ్రేయస్సును సూచిస్తుంది. దీనిని ఇంట్లో ఈశాన్యంలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయట. కేవలం తామర మాత్రమే కాదు.. గులాబీలు, ఇతర పువ్వులు కూడా శ్రేయస్సును అందించి ఎమోషనల్​గా బ్యాలెన్స్​గా ఉండేలా చేస్తాయి. 

పర్వతాలు (Mountains)

పర్వతాలు కలిగిన ఫోటోను ఇంట్లో నైరుతి దిశగా పెడితే మంచిది. ఇది స్థిరత్వాన్ని, మద్ధతును సూచిస్తుంది. ఇవి ప్రశాంతతను కూడా ఇస్తాయి. 

వాటర్​ఫాల్స్ (Waterfalls)

డబ్బులు, ఆర్థిక శ్రేయస్సు కోసం వాటర్​ఫాల్స్ పెయింటింగ్​ను ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో ఈ పెయింటింగ్ పెడితే అభివృద్ధి బాగుంటుంది. సానుకూలతను అందించి స్ట్రెస్​ని తగ్గిస్తాయి.

నెమలి (Peacock)

డబ్బుతో పాటు లక్ కలిసి రావాలంటే ఇంట్లో దక్షిణ దిశగా నెమలి పెయింటింగ్స్ పెడితే మంచిదట. చిలుకలు కూడా అదృష్టం, శ్రేయస్సును అందిస్తాయి. 

బుద్దుడు (Buddha)

బుద్దుడు బొమ్మలు, పెయింటింగ్స్​ని చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు. చాలామంది గిఫ్ట్​గా కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతంత కావాలి, ఒత్తిడి లేకుండా ఉండాలనుకునేవారు బుద్ధుడు పెయింటింగ్​ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో పెడితే మంచి ఫలితాలుంటాయి. 

ఈ రంగులు బెస్ట్ 

పెయింటింగ్స్​లో కొన్ని రంగులు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. సూర్యునితో అనుసంధానమైన పసుపును మంగళకరమైన రంగుగా చెప్తారు. ఇది సానుకూలతను ఇస్తుంది. ఆకుపచ్చ రంగు పెరుగుదలను సూచిస్తుంది. అంతేకాకుండా సామరస్యం, సమతుల్యను, శ్రేయస్సును ప్రోత్సాహిస్తాయి. ఆరెంజ్​ను శక్తివంతమైన రంగుగా చెప్తారు. ఇవి సృజనాత్మకత, ఆనందాన్ని ప్రేరేపిస్తాయట. 

ఈ తరహా పెయింటింగ్స్​ని ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఇంట్లో పెట్టుకోవాలన్నా.. ఎవరికైనా మంచిని కోరుతూ గిఫ్ట్ చేయాలన్నా ఈ పెయింటింగ్స్​ని గిఫ్ట్ చేయవచ్చు. ఇంట్లో ఇవే పెట్టుకోవాలని రూల్ ఏమి లేదు. కానీ పెట్టుకుంటే పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్తుంది వాస్తు శాస్త్రం.

 Also Read : 30 రోజులు డీటాక్స్ డైట్ చేస్తే బరువు తగ్గుతారట, మరెన్నో ప్రయోజనాలు.. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP DesamIPL 2025 Disha Patani Dance Controversy | ఐపీఎల్ వేడుకల్లో దిశా పటానీ డ్యాన్సులపై భారీ ట్రోలింగ్ | ABP DesamKKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
AP Pensions: త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Telugu TV Movies Today: విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget