Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
మినీ వరల్డ్ కప్ అని పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా అయితే తనదైన మొదలు పెట్టేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా.
మన ప్రిన్స్ శుభ్ మన్ గిల్ ఆడుతుంటే అంతకంటే ఏం కావాలండీ. చాలా సొగసుగా అసలే మాత్రం బలం ఉపయోగించకుండా కంప్లీట్ టెక్నిక్ అలా అలా మళ్లీ సెంచరీ బాదేశాడు యువరాజు శుభ్ మన్ గిల్. ఇంగ్లండ్ మీద ఆడిన మూడు వన్డేల్లోనూ రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాది ఫుల్ ఫామ్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టిన గిల్ దాన్ని అద్భుతంగా కంటిన్యూ చేశాడు. బంగ్లాదేశ్ విసిరిన 229 పరుగుల ఛేజ్ చేస్తూ 125 బంతుల్లో సెంచరీ బాదేసి తన కెరీర్ లో 8వ వన్డే సెంచరీ ని కంప్లీట్ చేశాడు గిల్. లాస్ట్ నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి గిల్ బాబుకి. అర్థం చేసుకోండి ఇక ఏ రేంజ్ లో ఫామ్ లో ఉన్నాడో. 2019 తర్వాత బంతుల పరంగా ఇదే స్లోయెస్ట్ సెంచరీ అయినా చాలా వ్యాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడాడు గిల్.
అసలు బంగ్లా పులులు విసిరిన టార్గెట్ ఛేజింగ్ ను ఆసక్తిగా మొదలుపెట్టింది అంటే మళ్లీ మన సెల్ఫ్ లెస్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించే చెప్పుకోవాలి. ఆయనకు హాఫ్ సెంచరీలు కొట్టాలనో, సెంచరీలు చేసి రికార్డులు పెంచుకోవాలనే లేదనే తరహా బ్యాటింగ్ మళ్లీ ఆడాడు ఈ మ్యాచులో. 36 బాల్స్ లోనే 41పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. జస్ట్ మిస్. లేదంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాడే ఆ ఇంటెంట్ అలా ఉంది హిట్ మ్యాన్.
రోహిత్ అవుటయ్యాక వచ్చిన మన కింగ్ క్రీజ్ లో సెటిల్ అవ్వటానికి చాలా టైమే తీసుకున్నాడు. 38 బాల్స్ ఆడి ఓ ఓఫోరు తో 22 పరుగులు చేశాడు. సరే లైన్లోకి వస్తున్నాడా మెల్లగా అన్న టైమ్ లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కి తిరుగుతున్న కెలికి పాయింట్ లో క్యాచ్ ఇచ్చేశాడు మన కింగ్ కొహ్లీ. తర్వాత వచ్చిన శ్రేయస్, అక్షర్ పటేల్ అవుట్ అవ్వటంతో ఏదో తేడా కొడుతోంది శీనా అన్న టైమ్ దిగాడు మన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ సారీ కేఎల్ రాహుల్. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు గిల్ కి స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఓఫోర్, రెండు సిక్సులతో చూడచక్కని షాట్లు ఆడాడు. 41పరుగులతో నాటౌట్ గా నిలవటమే కాదు టీమిండియాకు 6వికెట్ల విజయాన్ని అందించటంలో క్రూషియల్ రోల్ పోషించాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను తౌహిక్ హ్రిదోయ్ సెంచరీ, జకీర్ అలీ హాఫ్ సెంచరీతో రెండు చేతులతో ఆదుకున్నారు. ఫలితంగా 228పరుగులు చేసింది బంగ్లాదేశ్. వాస్తవానికి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా ఈ ఇద్దరు మంచి కమ్ బ్యాక్ ఇవ్వటంతో మంచి స్కోరే బోర్డు మీద. అండ్ టీమిండియాను ఆ స్కోరుతో బాగానే ఇబ్బందిపెట్టింది కూడా. మన స్పీడ్ గన్ షమీ...ఐసీసీ టోర్నమెంట్ అంటే నా టాలెంట్ ఆపలేనురా అన్నట్లు మరోసారి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుంటే..ముద్దుల వీరుడు హర్షిత్ రానా 3వికెట్లు...తృటిలో హ్యాట్రిక్ మిస్ అయిన అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఇక ఇండియాకు నెక్ట్స్ మ్యాచ్.... తెలుసుగా అసలు సిసుల మ్యాచ్ ఈనెల 23న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జరగనుంది. ఆ రోజు మాత్రం దుమ్ముదుమారం..సుమ్ము సుమారం. అప్పటివరకూ ఏబీపీ దేశం...అండ్ స్టంప్ మైక్ విత్ హర్ష ఫాలో అవుతూ ఉండండి..ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మనం షేర్ చేసుకుంటూ ఉందాం. అదిరిపోయే మ్యాచుల మీద మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్స్ తో మాతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.





















