Chiranjeevi Speech at Experium | ఎక్స్ పీరియమ్ థీమ్ పార్కును ప్రారంభోత్సవంలో చిరంజీవి | ABP Desam
చిలుకూరు బాలాజీ రోడ్డు లో ఉన్న ప్రొద్దూటూరు గ్రామంలో ఎక్స్ పీరియమ్ థీమ్ పార్కును సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి కలిసి ప్రారంభించారు. ఈ బొటానికల్ గార్డెన్ ఓపెనింగ్ సందర్భంగా చిరంజీవి రామ్ దేవ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తను ఇల్లు కట్టుకునేప్పుడు 20ఏళ్ల క్రితం రామ్ దేవ్ కొన్ని మొక్కలు తీసుకుని వచ్చి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అవి ఇప్పుడు మొత్తంగా ఇల్లంతా పాకేసి చూడటానికి తనేదో జైలులో ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నాయంటూ అందరినీ నవ్వించారు. పాతికవేల రకాల మొక్కలను వేర్వేరు దేశాల నుంచి తీసుకువచ్చి పెంచటం అంటే అది సాధారణ విషయం కాదన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎకో టూరిజం కోసం తెలంగాణను తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి దగ్గరగా ఎక్స్ పీరియం ప్రాజెక్టు డిజెన్ ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపిన చిరంజీవి...రాామ్ దేవ్ కు ఆయన బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తను పెద్దగా సంపాదన లేదు కాబట్టి కాస్ట్లీ మొక్కలు కొనలేనంటూ చమక్కులు కూడా విసిరారు.





















