PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి
PGCIL Vacancies: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 12వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

PGCIL Recruitment: హరియాణాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 18న ప్రారంభం కాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 115
⏩ మేనేజర్ (ఎలక్ట్రికల్): 09 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 06, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఎస్సీ- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.03.2025 నాటికి 39 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.80,000 - రూ.2,20,000.
⏩ డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 26, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 12, ఎస్సీ- 07, ఎస్టీ- 03.
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.03.2025 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.70,000 - రూ.2,20,000.
⏩ అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 58 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 31, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 14, ఎస్సీ- 09, ఎస్టీ- 04.
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.03.2025 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.60,000 - రూ.1,80,000.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.02.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.03.2025.
ALSO READ:
➥ బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో 407 ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి
➥ టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు- వివరాలు ఇలా ఉన్నాయి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

