Maha Kumbh Mela 2025 Stampede: మహాకుంభమేళాలో అపశ్రుతి - తొక్కిసలాటలో 15 మంది మృతి?, పలువురికి గాయాలు
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో త్రివేణి సంగమం ఘాట్ వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగి 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
![Maha Kumbh Mela 2025 Stampede: మహాకుంభమేళాలో అపశ్రుతి - తొక్కిసలాటలో 15 మంది మృతి?, పలువురికి గాయాలు stampede in triveni sangam in maha kumbh mela 2025 Maha Kumbh Mela 2025 Stampede: మహాకుంభమేళాలో అపశ్రుతి - తొక్కిసలాటలో 15 మంది మృతి?, పలువురికి గాయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/ca8f426a4ad0939416aa94d0a0309c291738112314062876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stampede In Maha Kumbh Mela 2025: ప్రయాగరాజ్ కుంభమేళాలో (Maha Kumbhmela ) బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం ఘాట్ వద్ద బారికేడ్లు విరగడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలంలో వైద్యుడు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, భక్తులు మరణించినట్లు వస్తోన్న సమాచారాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. పలువురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా అధికారులు సమీప సెక్టార్ 2 ఆస్పత్రికి తరలించారు. మౌని అమావాస్య రోజు పెద్ద సంఖ్యలో యాత్రికులు పుణ్యస్నానానికి రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఒక్క రోజే దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనాల మేరకు అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో త్రివేణి సంగమం వద్ద 12 కిలోమీటర్ల పొడవున ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులతో ప్రయాగరాజ్ పరిసరాలు నిండిపోయాయి.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Rescue operations are underway after a stampede-like situation arose in Maha Kumbh and several people were reported injured. https://t.co/4z63F7pAS9 pic.twitter.com/YxZHXIoy51
— ANI (@ANI) January 29, 2025
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Drone visuals from Sangam Ghat as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya pic.twitter.com/lND1iYoWp4
— ANI (@ANI) January 29, 2025
సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్
అటు, ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం యోగి అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం
మరోవైపు, తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారు. మౌనీ అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 2:30 తర్వాత నుంచే అధికారులు భక్తుల్ని ఘాట్‌లోకి అనుమతించారు. సెక్టార్ 2 ప్రాంతంలో ఓ బారికేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Maha Kumbh Mela 2025: మౌని అమావాస్య స్పెషల్ - మహా కుంభమేళా భక్తులకు కీలక సూచనలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)