అన్వేషించండి

HIT 3 Movie: మరో థ్రిల్లింగ్‌కు సిద్ధమేనా - నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ అప్ డేట్ వచ్చేసింది, టీజర్ ఎప్పుడంటే?

Nani Movie: 'హిట్' మూవీ ఫ్రాంచైజీ సిరీస్ 'హిట్ 3'లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ను ఆయన బర్త్ డే సందర్భంగా ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు.

Natural Star Nani's HIT 3 Movie Teaser Release Date: నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'హిట్ 3' (HIT 3). సైకో బ్యాక్ డ్రాప్‌లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన హిట్, హిట్ 2 మూవీస్ మంచి హిట్ అందుకున్నాయి. హిట్ ఫ్రాంచైజీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నాని భిన్నంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 'హిట్ 3' షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా.. టీజర్ విడుదలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వారి సస్పెన్స్‌కు మేకర్స్ తెరదించారు. నాని బర్త్ డే సందర్భంగా ఈ నెల 24న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

'హిట్' సక్సెస్ కొనసాగేలా..

గతంలో 'హిట్' సిరీస్‌లో వచ్చిన 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'హిట్'లో నటించగా.. 'హిట్ 2'లో అడవి శేష్ నటించి మెప్పించారు. హిట్ ఫ్రాంచైజీలో ఒక్కో కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆసక్తికరంగా కథను నడిపించారు. ఈ క్రమంలో హిట్ 2 సినిమా క్లైమాక్స్‌లోనే 'హిట్ 3' మూవీని నాని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉండనున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన ఓ వీడియో తేలిపోయింది. తొలి 2 సిరీస్‌ల్లో ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్వెస్టిగేషన్ జరగ్గా.. హిట్ 3 కేసు ఇన్వెస్టిగేషన్ దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. హీరో నాని విభిన్నంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తొలి 2 సినిమాల్లోనూ ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హిట్ 2 క్లైమాక్స్‌లోనే నాని రోల్‌కు సంబంధించి దర్శకుడు భారీ ఎలివేషన్ ఇచ్చారు. ఎప్పుడూ కోపంతో ఉండే ఎవరు చెప్పినా వినని ఓ పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన్ను చూపించనున్నారు. 

Also Read: మూవీ లవర్స్‌కు పండగే - ఒకే రోజు 'ఈటీవీ విన్'లో 16 సినిమాలు, అప్పటి హిట్స్ కూడా.. చూసి ఎంజాయ్ చేసెయ్యండి!

ఆ రూమర్ నిజమేనా..

అయితే, 'హిట్ 3'కు సంబంధించి ఓ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రెండు కీలక గెస్ట్ రోల్స్ ఉన్నాయని గాసిప్ వినిపిస్తోంది. మునుపటి సిరీస్‌ల్లో హీరోలైన విశ్వక్, అడవి శేష్.. 'హిట్ 3'లోనూ కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఒకవేళ ఇదే నిజమైతే ముగ్గురు స్టార్ హీరోలు ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో అభిమానులకు సూపర్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. 'సరిపోదా శనివారం' తర్వాత 'హిట్ 3' కాకుండా.. నాని యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' చేస్తున్నారు. ఆయనతో 'దసరా' తీసి హిట్టు కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

Also Read: 'నన్ను విమర్శించే హక్కు మీకు పూర్తిగా ఉంది' - ఇక నుంచి అసభ్యత లేకుండా సినిమాలు చేస్తా.. ఇట్లు మీ విశ్వక్ సేన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
Tirumala News: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - లవ్‌లో 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - లవ్‌లో 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
Tirumala News: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - లవ్‌లో 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - లవ్‌లో 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
Aditya 369 Re Release: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... 'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ మారిందోచ్... థియేటర్లలోకి వారం ముందుగా
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... 'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ మారిందోచ్... థియేటర్లలోకి వారం ముందుగా
Tamim Iqbal Heart Attack: మ్యాచ్ ఆడుతుంటే తమీమ్ ఇక్బాల్‌కు హార్ట్ అటాక్, ఆస్పత్రికి తరలించిన బంగ్లా క్రికెట్ బోర్డు- పరిస్థితి విషమం
మ్యాచ్ ఆడుతుంటే తమీమ్ ఇక్బాల్‌కు హార్ట్ అటాక్, ఆస్పత్రికి తరలించిన బంగ్లా క్రికెట్ బోర్డు- పరిస్థితి విషమం
Delhi Cash At Home Row: ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం, జస్టిస్‌ యశ్వంత్‌వర్మపై వేటు
Delhi Cash At Home Row: ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం, జస్టిస్‌ యశ్వంత్‌వర్మపై వేటు
Embed widget