ETV Win Movies: మూవీ లవర్స్‌కు పండగే - ఒకే రోజు 'ఈటీవీ విన్'లో 16 సినిమాలు, అప్పటి హిట్స్ కూడా.. చూసి ఎంజాయ్ చేసెయ్యండి!
Sammelanam OTT Platform: ఆనాటి ఫ్యామిలీ, లవ్, కామెడీ మూవీస్ అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి వారి కోసం కొత్త వెబ్ సిరీస్‌తో పాటు 15 సినిమాలను ఒకే రోజు 'ఈటీవీ విన్' స్ట్రీమింగ్ చేసింది.

Sammelanam Web Series Streming On ETV Win: కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనంతో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ ప్లాట్ ఫాం. ఆనాటి పాత మధుర జ్ఞాపకాలు మూవీలతో పాటు సీరియళ్లు, పలు సిరీస్‌లను సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ లవర్స్‌ను మరింత అలరించేలా గురువారం (ఫిబ్రవరి 20) ఓ కొత్త వెబ్ సిరీస్‌తో పాటు 15 ఓల్డ్ సినిమాలను స్ట్రీమింగ్ చేసింది. ప్రియా వడ్లమాని, గణాదిత్య, వినయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సమ్మేళనం' (Sammelanam). తరుణ్ మహదేవ్ దర్శకత్వం వహించగా.. పేరుకు తగ్గట్టుగానే ప్రేమ, స్నేహం, వినోదం 'సమ్మేళనం'గా సిరీస్ తెరకెక్కించారు. యూత్‌ను ఆకట్టుకునేలా ట్రయాంగిల్ లవ్, స్నేహం ప్రధానాంశాలుగా తీశారు.
కథేంటంటే..?
రామ్ (గణాదిత్య) రైటర్. అతనొక బుక్ రాయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పేపర్లలో అతనితో పాటు బుక్ గురించి ఫ్రంట్ పేజీల్లో వేస్తారు. దాంతో అతడిని వెతుకుతూ శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్ అభిషేక్), మేఘన (ప్రియా వడ్లమాని) వస్తారు. అర్జున్, రామ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. రైటర్ కావాలనేది రామ్ లక్ష్యం. అందుకు అర్జున్ సపోర్ట్ చేస్తుంటాడు. ఫైనాన్షియల్ పరంగానూ ఎంతో కేర్ తీసుకుంటాడు. తన ఆఫీసులో పరిచయమైన మేఘనతో అర్జున్ ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిని రామ్ కూడా ప్రేమిస్తాడు. మరి, మేఘన ఎవరిని ప్రేమించింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విలన్ ఎవరూ లేకుండా ఒకరికొకరు ఎలా దూరమయ్యారు? మళ్లీ ఎలా కలిశారు? మేఘన జీవితంలో చార్లీ (శ్రీకాంత్ గుర్రం) పాత్ర ఏమిటి? చివరకు ఎవరెవరు ఒక్కటి అయ్యారు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసేలా..
ఈ సిరీస్‌తో పాటే ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా అప్పటి ఫ్యామిలీ, లవ్, డెవోషనల్, కామెడీ జానర్లలోని 15 మూవీలను ఈటీవీ విన్ ప్లాట్ ఫాం మూవీ లవర్స్ కోసం స్ట్రీమింగ్ చేసింది. చింతకాయల రవి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, శ్రీరామదాసు, ఎవడు, స్టాలిన్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రామయ్యా వస్తావయ్యా, నాగవల్లి, మొగుడు, అదిరిందయ్యా చంద్రం, లవ్‌లీ, కేడీ, అదుర్స్, సోలో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ జాబితాలో ఉన్నాయి.
చిన్నారుల కోసం కార్టూన్ షోస్
కేవలం పెద్దల కోసమే కాకుండా చిన్నారులను సైతం ఆకర్షించేలా డిఫరెంట్ కార్టూన్ షోస్‌ను ఈటీవీ విన్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ నెల 27 నుంచి 5 సరికొత్త కార్టూన్ షోస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇటీవలే తెలిపింది. బాల్ బాహుబలి ది లాస్ట్ సన్ గార్డియన్, అభిమన్యు ది యంగ్ యోధా, కిట్టీ ఈజ్ నాట్ ఎ క్యాట్ సీజన్ 3, ది సిస్టర్స్, పాపులర్ జపనీస్ కార్టూన్ షో 'డిటెక్టివ్ కోనన్'ను తెలుగులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అటు, పెద్దలతో పాటు పిల్లలకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

