By: Arun Kumar Veera | Updated at : 19 Feb 2025 04:33 PM (IST)
వార్షిక ఆదాయంలో మూలధన లాభాలు కూడా కలిసి ఉంటే? ( Image Source : Other )
Tax SlabsIn New Income Tax Regime: 2025 కేంద్ర బడ్జెట్ సందర్భంగా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం కల్పించారు. దేశంలో, 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై దాయపు పన్ను ఉండదంటూ వరం ఇచ్చారు. దీనికి ప్రామాణిక మినహాయింపు (Standard deduction) రూ. 75,000 కూడా కలిపితే, పన్ను మినహాయింపు ప్రయోజనం పొందే వార్షిక ఆదాయ పరిమితి రూ. 12.75 లక్షలకు పెరుగుతుంది. అంటే, జీతం సంపాదించే ఉద్యోగి సంవత్సర ఆదాయం రూ. 12.75 లక్షల వరకు ఉన్నప్పటికీ పైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు, చాలా మంది ఉద్యోగుల నుంచి తరచుగా ఒక ప్రశ్న వినిపిస్తోంది. నిర్మల సీతారామన్ ప్రకటించిన ఆదాయ పన్ను మినహాయింపు నికర జీతం (In-Hand Salary Or Net Salary) పైనా లేదా స్థూల జీతం (CTC లేదా Gross Salary)పైనా అని గూగుల్ తల్లిని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని సరళమైన భాషలో తెలుసుకుందాం.
చేతికి వచ్చే జీతం లేదా CTC
ఆదాయ పన్ను చట్టం ప్రకారం, CTC (Cost to Company)పై పన్ను మినహాయింపు వర్తించదు, చేతికి వచ్చిన జీతంపైనే వర్తిస్తుంది. CTCలో బేసిక్ పే (ప్రాథమిక జీతం), అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు వంటి అనేక అంశాలు ఉంటాయి. ఇన్-హ్యాండ్ శాలరీ అంటే, ఉద్యోగి అన్ని తగ్గింపుల తర్వాత నేరుగా తన బ్యాంక్ ఖాతాలోకి పొందే మొత్తం. దీనిని ఇంకా సులభంగా అర్ధం చేసుకుందాం. మీ CTC రూ.14 లక్షలు అనుకుందాం. కటింగ్స్ పోను మీ టేక్-హోమ్ శాలరీ రూ. 12.75 లక్షలు అయితే, మీరు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ, మీ చేతికి వచ్చిన వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షలు పరిమితిని దాటి ఒక్క రూపాయి ఉన్నప్పటికీ, వర్తించే శ్లాబ్‌ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగం చేస్తూ నెలనెలా జీతం తీసుకుంటున్న వ్యక్తులకు మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. మిగిలిన వ్యక్తులకు స్టాండర్డ్ డిడక్షన్ లేకుండా రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది.
వార్షిక ఆదాయంలో మూలధన లాభాలు కూడా కలిసి ఉంటే?
ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఉద్యోగి మొత్తం వార్షిక ఆదాయంలో మూలధన లాభాలు లేదా ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం ఉంటే, అతను పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఉదహరణకు... ఒక వ్యక్తి మొత్తం ఆదాయం రూ. 12 లక్షలు అనుకుందాం. అందులో రూ. 8 లక్షలు జీతం, రూ. 4 లక్షలు మూలధన లాభం అయితే, అతను జీతం మొత్తంపై మాత్రమే పన్ను మినహాయింపు పొందగలడు. మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: వెంటనే రూ.40 లక్షలు కావాలా?, ఎక్స్‌ప్రెస్ లోన్ స్కీమ్ తీసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
Government Scheme: 'నమో డ్రోన్ దీదీ యోజన వల్ల' ఏంటి ప్రయోజనం, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
Govt Pension Scheme: రోజుకూలీలకు కూడా పెన్షన్ - ముదిమి వయస్సులో ఉండదు టెన్షన్
Passport Application: పాస్‌పోర్ట్ అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇస్తే ఆ తర్వాత జరిగేది ఇదే
Gold-Silver Prices Today 16 Mar: రూ.90,000కు తగ్గని గోల్డ్, రూ.లక్ష పైన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Investment Scheme For Girls: ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
Samantha: ఆస్పత్రి బెడ్‌పై సమంత.? - అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన!
SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy