G Trisha Century U19 Womens T20 World Cup | టీమిండియాను సెమీస్ కు తీసుకెళ్లిన తెలంగాణ అమ్మాయి | ABP
మలేషియాలో జరుగుతున్న U19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో తెలంగాణ అమ్మాయి దుమ్మురేపింది. భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష ఆల్ రౌండ్ షో తో అదరగొట్టేసింది. పైగా U19 టీ20 మహిళల వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ లేని రికార్డును తన పేరు మీద క్రియేట్ చేసింది ఈ అమ్మాయి. స్కాట్లాండ్ తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో 59 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సర్లతో 110 పరుగులు చేసింది త్రిష. ఫలితంగా U19 మహిళల టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ సెంచరీ కొట్టేసింది. త్రిష బీభత్సానికి టీమిండియా 20 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 208పరుగులు చేసింది. 209పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ను మళ్లీ త్రిషే బౌలింగ్ తోనూ బెదరగొట్టింది. రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 6పరుగులు ఇచ్చి 3వికెట్లు తీసింది త్రిష. ఫలితంగా స్కాట్లాండ్ 58పరుగులకే ఆలౌటై భారత్ కు 150పరుగుల భారీ విక్టరీని కట్టబెట్టింది. అటు సెంచరీతో బ్యాటింగ్ లో..ఇటు బౌలింగ్ లో మూడు వికెట్లు తీసిన త్రిషకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. త్రిషకు ఈ వరల్డ్ కప్ లో ఇది రెండో అవార్డు. ఈ విక్టరీతో భారత్ సెమీస్ లో ఇంగ్లండ్ ను ఢీకొట్టనుంది. త్రిష సెంచరీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి త్రిషను శభాష్ తెలంగాణ బిడ్డ అంటూ అభినందించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.





















