Ban vs Ind Champions Trophy 2025 | బాగానే ఆడిన బంగ్లా బాబులు..షమీ అన్న మాస్ కమ్ బ్యాక్ | ABP Desam
తుత్తర ఎక్కువ అని ముద్దుగా పిలిపించుకునే నాగిన్ బ్యాచ్ బంగ్లా బాబులు ఛాంపియన్స్ ట్రోఫీని బ్యాటింగ్ లో అయితే బాగానే ఆరంభించారు. అప్పుడు ఐసీసీ ఈవెంట్లలో పెద్ద టీమ్ లకు షాకులిచ్చి మేమూ పెద్ద టీమే అనిపించుకునే బంగ్లాదేశ్...భారత్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 49.4 ఓవర్లు బ్యాటింగ్ చేశారు బంగ్లా బ్యాటర్లు. కొట్టింది తక్కువ స్కోరే ఎందుకు కేజీఎఫ్ రేంజ్ బిల్డప్ ఇస్తున్నావ్ అని మీరు అనుకోవచ్చు కానీ మ్యాటరేంటంటే నాగిన్ రాజాలను మనోళ్లు 35పరుగులకే మడతెట్టేశారు. మన పేస్ పవర్ రైడర్ షమీ, ముద్దుల రాజా హర్షిత్ రానా, అన్నగారు ఆల్ రౌండర్ అక్ష ర్ పటేల్ అదరగొట్టేయటంతో పాపం బంగ్లాదేశ్ 35పరుగులకే 5 వికెట్లు కోల్పోయి విలవిలాడిపోయింది. అక్షర్ పటేల్ తీసిన రెండు వరుస బంతుల్లో తీశాడు. ఓపెనర్ తంజిద్ హసన్ ను, ముష్ఫికర్ రహీమ్ ను వరుస బాల్స్ లోనే అవుట్ చేశాడు. హ్యాట్రిక్ కూడా తీసేసేవాడే. కానీ జకీర్ అలీ సమర్పించుకున్న సింపుల్ క్యాచ్ స్లిప్ లో మన కెప్టెన్ సార్ వాడు రోహిత్ శర్మ వదిలేసేయటంతో బతికిపోయాడు. పాపం అక్షర్ పటేల్ కి కెరీర్ లో ఫస్ట్ హ్యాట్రిక్ తృటిలో మిస్సయి పోయింది. మన దరిద్రం ఏంటంటే అలా బతికిపోయిన జకీర్ అలీ హాఫ్ సెంచరీతో మనమీదనే పుష్ప రాజ్ లా గడ్డం తిప్పుతూ తగ్గేదేలే అన్నాడు. బ్యాడ్ లక్ ఏం చేస్తాం.జకీర్ అలీ మరో ఎండ్ లో తౌహిద్ హ్రిదోయ్ కూడా తోడవటంతో వికెట్ల పతనం ఆగిపోయింది. ఇద్దరూ కలిసి 150 రన్స్ పైగా పార్టనర్ షిప్ పెట్టి...భారత్ బౌలర్ల జోరును చాలా అంటే చాలా గట్టిగా అడ్డుకున్నారు. జకీర్ 68కొట్టి అవుట్ అయితే..క్రాంప్స్ వచ్చి విలవిలలాడిన తౌహిద్ హ్రిదోయ్ అవతలి ఎండ్ లో బౌలర్లను పెట్టుకుని కుంటుతూ పరిగెడుతూ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో షమీ బాబాయ్ మళ్లీ బులెట్ల లాంటి బాల్స్ తోనే బంగ్లా బ్యాటర్ల ఆటకట్టించాడు. ఐదు వికెట్లు తీసుకుని ఐసీసీ ఈవెంట్లో తన మాస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తున్నాడు. హర్షిత్ రానా 3, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకోవటంతో బంగ్లా దేశ్ 228పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా గెలవాలంటే 229 పరుగులు చేయాలి. మరి మనోళ్లు ఏం చేస్తారో చూడాలి. మ్యాచ్ అవ్వగానే కంప్లీట్ హైలెట్స్ తో మళ్లీ ముందుకు వస్తాను. మ్యాచ్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ను సబ్ స్రైబ్ చేసుకోండి...స్టంప్ విత్ మైక్ హర్షని ఫాలో అయిపోయిండి.





















