PM Modi Shake Hand AP Leaders | ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో ఏపీ లీడర్లకు గౌరవం | ABP Desam
ఎన్డీయే కూటమిలో ఏపీ లీడర్లకి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈరోజు మరొకసారి ప్రూవ్ అయ్యింది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రేఖాగుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకకు ఎన్డీయే కూటమిలోని కీలకనేతలంతా హాజరయ్యారు. ప్రధాని మోదీ సభకు రాగానే ప్రజలకు నమస్కరించి వేదిక మీదున్న ఎన్డీయే నేతలను పలకరించారు. అయితే అందరికీ నమస్తే పెట్టుకుంటూ వెళ్లిపోయిన మోదీ కేవలం ఇద్దరు నేతలకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చారు కాసేపు మాట్లాడారు. వాళ్లిద్దరే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాల గురించి మోదీ ప్రశ్నించినట్లు విజువల్స్ లో అర్థం అవుతోంది. ఎప్పుడూ మాలలోనే ఉంటున్నారా అని అడిగినట్లు ఉన్నారు. పవన్ నవ్వతూ అవునంటూ తల ఊపుతూ చెప్పారు. ఆ తర్వాత అమిత్ షా, జేపీనడ్డాల మధ్య కూర్చున్న సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారు అంటూ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వేదిక మీద అంత పెద్దలు ఉన్నా కేవలం ఏపీ లీడర్లనే మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించటం చూస్తుంటే కూటమిలో ఈ ఇద్దరి ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ, జనసేన నేతలు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.





















