అన్వేషించండి

Crime News: చెల్లిపై కోటి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు - వీడు అన్న కాదు హంతకుడు !

Prakasam : చెల్లెలి కోసం ప్రాణాలు ఇచ్చే లోకంలో ఆమెకు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడో అన్న. ఈ ఘోరం ప్రకాశం జిల్లాలో జరిగింది.

Podili brother killed his own sister by insuring it for one crore twenty lakhs: తోడబుట్టిన చెల్లి కోసం జీవితాన్ని త్యాగం చేసే అన్నలు చాలా మంది ఉంటారు. కానీ తనకు అప్పనంగా డబ్బులు వచ్చేందుకు సొంత చెల్లిని అత్యంత కిరాతకంగా చంపేవాళ్లు మాత్రం అతి కొద్ది మంది ఉంటారు. వారిలో అశోక్ రెడ్డి అనేక రాక్షసుడు కూడా ఒకరు. ఇతను చెల్లి పేరుపై కోటి ఇరవై లక్షలకుపైగా ఇన్సూరెన్స్ చేయించి.. చంపేసాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో సెటిలైపోవాలనుకున్నాడు. కానీ దొరికిపోయాడు.                      

ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెంలో సంధ్యా అనే యువతి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదును ఆమె సోదరుడు అశోక్ రెడ్డి  చేశాడు. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరిస్తే.. ఎక్కడా రోడ్డు ప్రమాద ఆనవాళ్లు కనిపించలేదు. ఇదేదో తేడా కేసుగా ఉందని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదమేనని .. అలా కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని అశోక్ రెడ్డి పదే పదే పోలీస్ స్టేషన్ కు తిరుగుతూండటంతో పోలీసులకు ఇంకా డౌట్ పెరిగిపోయింది. ఏదో ఉందని మెల్లగా ఆరా తీయడం ప్రారంభించారు. ఎక్కువ ఆరా తీయకుండానే అసలు విషయం తెలిసిపోయింది.                                

సంధ్యపై ఇటీవలే రూ.కోటి ఇరవై లక్షలకు టర్మ్ పాలసీని అశోక్ రెడ్డి తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడే ఏదో మతలబు ఉందని గుర్తించి వెంటనే విచారణ ప్రారంభించారు. చివరికి క్లూ దొరికింది. ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని.. అశోక్ రెడ్డినే చెల్లిని చంపి రోడ్డు ప్రమాదంగా చూపించి ఆ కోటి ఇరవై లక్షలు తీసుకుని సెటిలైపోవాలని అనుకున్నాడని తేలిపింది. పోలీసులు అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చే సరికి తన కోటి ఇరవై లక్షల కల గురించి చెప్పేశాడు. దాంతో పోలీసులు అరెస్టు చేసి.. లోపలికి పంపించారు.  

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని ఇంత ఘోరంగా చంపేసిన అశోక్ రెడ్డి వ్యవహారం కాటూరివారి పాలెంలోనే కాదు..ఏపీలోనే సంచలనంగా మారింది. ఆ చెల్లి .. తనను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాడని అనుకుంది. తనకు ఇన్సూరెన్స్ చేయిస్తే..అందరూ చేయించుకుటున్నారు కదా అనుకుంది. కానీ తన ప్రాణానికి కోటి ఇరవై లక్షలు విలువ కట్టాడని ఆ చెల్లి గుర్తించలేకపపోయింది. అమాయకంగా అన్నను నమ్మి  ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి కొడుకును కన్నందుకు.. ఆ తల్లిదండ్రులు కడుపకోతకు గురవుతున్నారు.  కన్న కొడుకే కన్న కూతుర్ని చంపడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Also Read: Meerpet Murder Case: భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు - ఇంత ఘోరమా ?

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Embed widget