Nara Lokesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
Andhra News: త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' అమలు చేయనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థులకు యాక్టివిటీస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Minister Lokesh Review On School And Intermediate Education: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పుస్తకాల భారం, బ్యాగుల బరువు తగ్గించేలా చర్యలు చేపట్టింది. త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' (No Bag Day) అమలు చేయబోతున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థులకు యాక్టివిటీస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ హయాంలో పాఠశాల విద్యలో అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ తర్వాతే అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని సూచించాలని చెప్పారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపై సమావేశంలో చర్చించారు. దీనిపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.
ఒకటే యాప్..
పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని లోకేశ్ అధికారులకు సూచించారు. టీచర్లకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్ రూపొందించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడీ అనుసంధానంపై ఆరా తీశారు. అటు, ఇంటర్మీడియట్ విద్యా శాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా అధికారులతో చర్చించారు.
Also Read: CM Chandrababu: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ - వారికే తొలి ప్రాధాన్యం, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం






















