Tirumala : శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు..తిరుమలలో ఈ టైమ్ లో ఇంత రద్దీ ఎందుకో తెలుసా సామీ!
Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది..శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోంది. ఈ టైమ్ లో ఇంత రష్ ఎందుకో తెలుసా...

Tirumala Rush: తిరుమలేశుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఫిబ్రవరి 20 గురువారం ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా టైమ్ పట్టేస్తోంది. వారం ప్రారంభం సోమవారం రోజు కొంత రద్దీ తగ్గినట్టు కనిపించినా..మళ్లీ మంగళవారం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈరోజు గురువారం ...రేపటి నుంచి వీకెండ్ సందడి ప్రారంభం కావడంతో శుక్రవారం, శనివారం, ఆదివారం .. రోజుల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు టీటీడీ అధికారులు.
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
వాస్తవానికి న్యూ ఇయర్, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి హడావుడి ముగిసిన తర్వాత మళ్లీ సమ్మర్ హాలిడేస్ లో తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఫిబ్రవరిలోనూ శ్రీవారి సన్నిధి భక్తులతో వెలిగిపోతోంది.
సమ్మర్లో ఆ వేడి భరించడం కన్నా ముందుగానే తిరుమల వెళ్లిరావడం మంచిదనే ఆలోచన కొందరిది
పరీక్షలు మొదలయ్యేలోగా శ్రీవారిని దర్శించుకుని రావాలన్న సెంటిమెంట్ మరికొందరిది
స్టూడెంట్స్ కి హాలిడేస్ ఇచ్చేస్తే తిరుమలలో రష్ పెరుగుతుందనే ఆలోచనతో ముందే దర్శనం చేసుకుంటున్నవారు ఇంకొందరు
మొక్కులు తీర్చుకునేందుకు అధిక రద్దీ లేని సమయంలోనే వెళ్లడం బెటరనే ఆలోచన...ఇంకా ఇంకా...కారణాలు ఏమైనా కానీ తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగుతూనే ఉంది
ప్రతి వీకెండ్ భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
ఫిబ్రవరి 20 గురువారం రోజు మొత్తం 12 కంపార్ట్ మెంట్స్ లో భక్తులు వేచి చూస్తున్నారు.
ఉచిత దర్శం క్యూ లైన్ల్లోకి ఎలాంటి టికెట్ లేకుండా వెళ్లిన భక్తులకు దాదాపు 14 గంటలు సమయం పట్టేస్తోంది.
300 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సమయం మూడు నుంచి నాలుగు గంటలు
టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలు పట్టేస్తోందని టీటీడీ అధికారులు వెల్లడించారు
ఫిబ్రవరి 19 బుధవారం రోజు తిరుమల శ్రీవారిని మొత్తం 72 వేల 745 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24 వేల 156 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు.
Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!
శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం ( Sri Venkateshwara Panchaka Stotram )
శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం
శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |
శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ-
-న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |
చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
నందగోపనందనం సనందనాదివందితం
కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |
నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
నాగరాజపాలనం భోగినాథశాయినం
నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |
నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం-
-విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||
ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |
Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

