అన్వేషించండి

Govardhan Puja 2024 Date: కార్తీకమాసం మొదటి రోజు గోవర్ధన పూజ .. దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది!

History of Goverdhan Puja 2024: ఏటా దీపావళి అమావాస్య మరుసటి రోజు ..కార్తీకమాసం ప్రారంభం రోజు గోవర్థన పూజ జరుపుకుంటారు. ఈ ఏడాది ఎప్పుడొచ్చింది? ఈ వేడుక ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం...

Significance Of Govardhan Puja:  ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకునే గోవర్ధన్ పూజను కొన్ని ప్రాంతాల్లో అన్న కూట్ అని కూడా పిలుస్తారు. ప్రకృతికి - మనిషికి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక ఈ పండుగ. ఈ రోజు శ్రీ కృష్ణుడిని, గోవులను పూజిస్తారు. మొత్తం 56 రకాల నైవైద్యాలు సమర్పిస్తారు.  

ఈ ఏడాది  గోవర్థన్ పూజ ఎప్పుడొచ్చింది

సాధారణంగా దీపావళి మరుసటి రోజు గోవర్థన పూజ చేస్తారు.. అంటే కార్తీక మాసం మొదటి రోజు వచ్చే పాడ్యమి రోజు. అయితే ఈ ఏడాది తిథులు తగులు మిగులు రావడంతో ఆశ్వయుజ అమావాస్య, కార్తీక పాడ్యమి రెండు రోజులు వచ్చాయి. దీంతో ఏ రోజు పరిగణలోకి తీసుకోవాలనే సందేహం ఉంది. దీపావళిని అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు జరుపుకోవాలి కాబట్టి అక్టోబరు 31 గురువారం సూర్యాస్తమయ సమయానికి అమావాస్య ఉండడంతో అదే రోజు నరకచతుర్థశి, దీపావళి వచ్చాయి. నవంబరు 1 శుక్రవారం ఉదయానికి అమావాస్య ఉంది..అంటే సూర్యోదయానికి పాడ్యమి లేదు.. నవంబరు 02 శనివారం పాడ్యమి తిథి సూర్యోదయానికి ఉంది. అందుకే కార్తీకమాసం ప్రారంభం అయ్యే ఈ రోజు గోవర్థన పూజ జరుపుకోవాలి. 

Also Read: ఈ దీపావళికి అయోధ్యలో అద్భుతం..అస్సలు మిస్సవకండి!

మీ అవగాహన కోసం ఏ తిథి ఎప్పటివరకూ ఉందో ఇక్కడ తెలుసుకోండి

అమావాస్య - అక్టోబరు 31 గురువారం 2 గంటల 45 నిముషాల నుంచి నవంబరు 01 శుక్రవారం సాయంత్రం 4 గంటల 47 నిముషాల వరకూ

పాడ్యమి - నవంబరు 01 శుక్రవారం సాయంత్రం 4 గంటల 48 నిముషాల నుంచి నవంబరు 02 శనివారం సాయంత్రం 6 గంటల 33 నిముషాల వరకూ. 

నవంబరు 02 శుక్రవారం రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఐదున్నర. అంటే పాడ్యమి తిథి సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ఉన్న రోజు అంటే నవంబరు 02 శనివారమే ఇదే రోజు కార్తీకమాసం ప్రారంభం అవుతోంది..ఇదే రోజు గోవర్థన పూజ చేసుకోవాలి. 

Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
 
శ్రీ కృష్ణుడి పట్ల రేపల్లె ప్రజలకు ఉన్న భక్తిని భరించలేని ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తాడు. రేపల్లె ప్రజలపై ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి ప్రజలను, గోవులను రక్షించేందుకు చిటికెన వేలుపై గోవర్థన పర్వతాన్ని గొడుగుగా పట్టుకున్నది కార్తీక శుక్ల పాడ్యమి రోజే.  అందుకే ఈ రోజు శ్రీ కృష్ణుడికి, గోవులకు, గోవర్థన పర్వతానికి పూజచేస్తారంతా. ఈ వేడుక బంధం, ఆత్మీయత, ప్రకృతి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.  
 
గోవర్థన పూజ ఎలా చేయాలి?

గోవర్ధన పూజ చేయాలి అనుకునేవారు ఆవుపేడతో ఓ పర్వతాన్ని తయారు చేసి..ఆ పక్కనే శ్రీకృష్ణుడి ఫొటో, ఆవు బొమ్మ కానీ,ప్రతిమ కానీ ఉంచాలి. నువ్వుల నూనె లేదా నేతితో దీపం వెలిగించి...పూలు, పసుపు, చందనం , కుంకుమ సమర్పించి పూజ చేయాలి. తియ్యటి పదార్థాలను నివేదించి వాటినే ప్రసాదంగా అందరకీ పంచాలి. శ్రీకృష్ణాష్టకం, శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకున్న అనంతరం నివేదన తర్వాత గోవర్థనగిరి కథ చదువుకోవాలి.  

Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!

గోవర్ధన పూజ ఎందుకు చేయాలి?

ఏ ఇంట్లో గోవర్ధన పూజ చేస్తారో ఆ ఇంట్లో ఆనందానికి లోటుండదని పండితులు చెబుతారు. ఆరాధ్యుడు మాత్రమే కాదు గురువుగా మీ వెన్నంటే ఉండి శ్రీ కృష్ణుడు నడిపిస్తాడని విశ్వశిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు తీరిపోయి శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget