Thala Trailer: కంఫర్ట్ జోన్ వదిలి కొత్తగా ట్రై చేసిన అమ్మ రాజశేఖర్... రక్తంతో ఎరుపెక్కిన 'తల', ట్రైలర్ చూశారా?
Thala Trailer Review: తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా తల. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. అదెలా ఉందో చూశారా?

నృత్య దర్శకుడిగా 'అమ్మ' రాజశేఖర్ (Amma Rajasekhar)కు ఒక స్టైల్ ఉంది. ఆయనది కమర్షియల్ పంథా. ఆయనలో ఒక దర్శకుడు ఉన్నాడు. గోపీచంద్ హీరోగా రణం వంటి బ్లాక్ బస్టర్ తీశాడు. దర్శకుడుగానూ ఆయనది కమర్షియల్ ఫార్ములా. తనయుడు అమ్మ రాగిన్ రాజ్ (Amma Ragin Raj) కథానాయకుడిగా 'అమ్మ' రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా 'తల' (Thala Movie).
'తల' ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. అది చూస్తే... ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కమర్షియల్ పంథాలో 'అమ్మ' రాజశేఖర్ ఈ సినిమా తీసినట్టు అర్థం అవుతోంది.
యాక్షన్ ప్యాక్డ్... ఆ ఒక్క షాట్!
Thala Trailer Review: 'అమ్మాయి కోసం చచ్చిపోయే కుర్రాళ్లను చూశాను, అమ్మ కోసం చనిపోయే కుర్రాడిని మొదటిసారి చూస్తున్నాను' - 'తల' ట్రైలర్‌లో సముద్ర చెప్పిన డైలాగ్. 'అందరికీ అమ్మ అంటే ఇష్టం. నాన్న అంటే ఇష్టం. తమ్ముడు, చెల్లి, అన్న... అందరూ ఇష్టం. కానీ, నాకు ఎవరూ లేరు. అన్నీ అమ్మే. అందుకే నాకు అమ్మ అంటే ఇష్టం కాదు, పిచ్చి' - సముద్ర డైలాగుతో పాటు ఇదొక్కటీ చాలు... హీరో క్యారెక్టర్ గురించి చెప్పడానికి!
అమ్మ అంటే పిచ్చి ఉన్న ఒక కుర్రాడు ఎవరెవరితో ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది 'తల' సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. మదర్ సెంటిమెంట్, లవ్ వంటి ఎమోషన్స్‌తో పాటు విలన్ క్యారెక్టర్స్ అండ్ ఫైట్స్ కొత్తగా డిజైన్ చేసినట్టు అర్థం అవుతోంది. ఒంటి నిండా నల్లరంగు పూసుకుని వచ్చిన విలన్స్, ఆ మధ్య జాతర సీన్స్ క్యూరియాసిటీ పెంచాయి.
Also Read: 'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు
'అమ్మ' రాగిన్ రాజ్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'తల' చిత్రాన్ని పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. ఇందులో అంకిత నాన్సర్ హీరోయిన్. రాధ రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, 'సత్యం' రాజేష్, 'ముక్కు' అవినాష్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రల్లో నటించారు. హీరో అశ్విన్, సోహైల్ ట్రైలర్ విడుదల చేశారు.
అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ... ''అమ్మా నాన్నలు ఈ సినిమా చాలా కష్టపడ్డారు. వాతావరణంలో మార్పుల వల్ల బోలెడు కష్టాలు పడ్డాం. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు నాడు తప్పకుండా చూడండి. మీ డబ్బులకు ఈ సినిమా న్యాయం చేస్తుంది'' అని అన్నారు. 'అమ్మ' రాజశేఖర్ మాట్లాడుతూ... ''ఇండస్ట్రీలో అందరూ అమ్మ రాజశేఖర్ ఫినిష్ అంటున్నారు. ఇప్పుడు 'తల'తో వచ్చా. మా అమ్మకు ఒంట్లో బాలేదు కనుక కాస్త గ్యాప్ తీసుకున్నా. ఇకపై ఫ్రీ. నా కొడుకుతో సినిమా చేయాలని నా కోరిక. మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తానని చెప్పినప్పటి నుంచి నిద్రలేదు. మాస్ సినిమా తీయాలనుకున్నాను. రెండేళ్లు ఆలోచించి కొత్త పాయింట్ తీసుకున్నా. నా దేవుడు శ్రీనివాస్ గౌడ్ గారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నాం. మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్ వచ్చిందంటే శ్యామ్ కె నాయుడు కారణం'' అని చెప్పారు.
Also Read: పద్మ భూషణ్ బాలకృష్ణ కోసం... ఈసారైనా అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?





















