Sankranthiki Vasthunnam OTT Release Date: ఏమండోయ్.. ఏంటండీ ఈ సస్పెన్స్ - 'సంక్రాంతికి వస్తున్నాం'పై జీ5 సరదా పోస్ట్.. ముందుగా టీవీలోనా లేక ఓటీటీలోనా!
Sankranthiki Vasthunnam OTT Platform: విక్టరీ వెంకటేశ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'పై జీ5 పెట్టిన సరదా పోస్ట్ వైరల్‌గా మారింది. కూసంత చమత్కారం కోసం వేచి ఉండండి అంటూ పోస్ట్ పెట్టింది.

Sankranthiki Vasthunnam OTT Release On Zee 5 OTT Platform: టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ఈ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కిన మూవీలో వెంకటేశ్ తన కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. ఆయన సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. 'బుల్లిరాజు'గా ఛైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జీ5 పెట్టిన సరదా పోస్ట్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసింది. 'ఏమండోయ్.. వాళ్లు చూస్తున్నారు.
మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తాం.' అని పోస్ట్ పెట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే, 'సంక్రాంతికి వస్తున్నాం' డిజిటల్, ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేయగా.. తొలుత అనుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే, ఊహించని స్పందనతో ఓటీటీ స్ట్రీమింగ్ తేదీల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ముందుగా టీవీలోనేనా..?
ఈ సినిమా ముందుగానే ఓటీటీలోకి వస్తుందని అంతా భావిస్తుండగా.. ఇటీవలే జీ5 ఓ పోస్ట్ పెట్టింది. ఓటీటీ కన్నా ముందుగానే టీవీలో అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ జోడించింది. దీంతో టీవీలో వచ్చిన తర్వాతే ఓటీటీలోకి రానుందని స్పష్టత వచ్చింది. మార్చి మొదటి వారంలో జీ తెలుగు ఛానెల్‌లో వచ్చిన తర్వాత రోజు నుంచి 'ZEE5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజా పోస్ట్‌తో ఆసక్తి నెలకొంది. ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు.? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రికార్డు కలెక్షన్లు
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మూవీ రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. వెంకీ తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. మూవీలో మురళీధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించగా.. భీమ్స్ సెరిరోలియో సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా 'గోదారి గట్టు', 'మీను', 'బ్లాక్ బస్టర్ సంక్రాంతి' పాటలు యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. గోదారి గట్టు పాటను రమణగోగుల, మధుప్రియ పాడగా.. 'బ్లాక్ బస్టర్ సంక్రాంతి' పాటను వెంకీనే స్వయంగా పాడారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెంకీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

