search
×

PM Kisan Nidhi: ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!

PM Kisan Yojana Update: ప్రధాన మంత్రి కిసాన్ యోజన 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. కొందరు రైతులకు మాత్రం ఆ ప్రయోజనం లభించదు.

FOLLOW US: 
Share:

PM Kisan Yojana 19th Installment Released Soon: నేటికీ, భారతదేశ జనాభాలో సగం మందికి పైగా వ్యవసాయం & అనుబంధ రంగాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అందుకే, భారత ప్రభుత్వం రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయినప్పటికీ, దేశంలోని చాలా మంది రైతులు, ముఖ్యంగా చిన్న రైతులు వ్యవసాయం నుంచి లాభం సంపాదించలేకపోతున్నారు.

వ్యవసాయం రూపాయి కూడా మిగలక దిగాలు పడుతున్న సన్నకారు రైతులకు భారత ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనికోసం, 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana)ను ప్రారంభించింది. దీనిని పీఎం కిసాన్‌ (PM Kisan) అని కూడా పిలుస్తారు. ఈ పథకం ద్వారా, కేంద్ర ప్రభుత్వం, అర్హుడైన ఒక్కో రైతుకు ఏటా రూ. 6000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తం, విడతల ‍‌వారీగా ‍‌(PM Kisan Yojana Installment), ఏడాదిలో మూడు విడతలుగా (రూ.2000 చొప్పున) డైరెక్ట్‌గా రైతు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతాయి. పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 18 వాయిదాలు విడుదల అయ్యాయి. 

మరో ఆసక్తిర కథనం: రూ.5 లక్షలు దాటిన డిపాజిట్‌లకు కూడా బీమా కవరేజ్‌!, మీ డబ్బుకు మరింత భద్రత 

ఫిబ్రవరి 24న 19వ విడత డబ్బులు విడుదల
దేశంలోని దాదాపు 13 కోట్ల మందికి పైగా రైతులు తదుపరి విడత కోసం, అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత (PM Kisan Yojana 19th Installment) కోసం ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్‌ 19వ విడత రూ.2 వేలు ఈ నెల 24న (సోమవారం) రైతుల ఖాతాల్లో జమ అవుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే వెల్లడించారు. ఆ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) రిలీజ్‌ చేస్తారు. అయితే, ఈసారి చాలా మంది రైతులు ఈ ప్రయోజనాన్ని పొందలేకపోవచ్చు.   

ఈ రైతులకు ప్రయోజనం ఉండదు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందడానికి రైతులు తమ అర్హత నిరూపించుకోవాలి. దీనికోసం పెద్ద పనులేవీ చేయాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్‌ పథకం ప్రయోజనాలను పొందడానికి రైతులు ఈ-కేవైసీ (e-KYC) చేయించుకుంటే చాలు. e-KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులు ప్రయోజనాలను పొందడంలో సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్లకు రావలసిన డబ్బు ఆగిపోవచ్చు. అంతేకాదు, రైతు బ్యాంక్‌ ఖాతాలో DBT ఫెసిలిటీ అంటే 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' సౌకర్యం రద్దయితే కూడా 19వ విడత డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, తదుపరి విడత విడుదలయ్యే ముందే రైతులు ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.           

మరో ఆసక్తిర కథనం: పసిడి పరుగును ఎవరైనా ఆపండయ్యా - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

Published at : 19 Feb 2025 04:15 PM (IST) Tags: PM Kisan Yojana PM Kisan Money PM Kisan Installment PM Kisan Samman Nidhi PM Kisan Yojana News

ఇవి కూడా చూడండి

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారా? అందరూ చేసే ఈ తప్పులు మీరు మాత్రం చేయొద్దు

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారా? అందరూ చేసే ఈ తప్పులు మీరు మాత్రం చేయొద్దు

Credit Card Loan: క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి

Credit Card Loan: క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి

Travel Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లతో ప్రయోజనాలే కాదు, మీకు తెలీని సీక్రెట్స్‌ కూడా ఉన్నాయి

Travel Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లతో ప్రయోజనాలే కాదు, మీకు తెలీని సీక్రెట్స్‌ కూడా ఉన్నాయి

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం

Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం

టాప్ స్టోరీస్

Tirumala Tickets News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Tickets News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

RC16: రామ్ చరణ్ 'RC16' మూవీలో కన్నడ దివంగత నటుడి సతీమణి? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?

RC16: రామ్ చరణ్ 'RC16' మూవీలో కన్నడ దివంగత నటుడి సతీమణి? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు