WATCH: ఎంత పని చేశావ్ రోహిత్ భాయ్! భారత్ ఫీల్డింగ్‌పై దారుణమైన ట్రోలింగ్
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అక్సర్ హ్యాట్రిక్ ఛాన్స్‌ను రోహిత్ నేలపాలు చేశాడు. దీనిపై ట్రోల్స్ నడుస్తున్నాయి.

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20 (గురువారం)న బంగ్లాదేశ్‌తో ఆడుతోంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన జరిగింది. IND vs BAN మ్యాచ్‌లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ ఛాన్స్ కోల్పోయాడు. సునాయాసమైన క్యాచ్‌ను రోహిత్ విడిచిపెట్టడంతో హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయిపోయింది.
క్యాచ్ నేలపాలు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ నేలపై బలంగా కొడుతూ తన ఆగ్రహాన్ని చూపించాడు. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ ఈజీ క్యాచ్‌ను వదిలేశారు. తర్వాత నిరాశతో మూడు లేదా నాలుగు సార్లు నేలను కొడుతూ కనిపించాడు. ముఖ్యంగా ఈ క్యాచ్‌ను పట్టి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడిగా అక్షర్ పటేల్ నిలిచేవాడు. కానీ రోహిత్ ఆ ఛాన్స్ మిస్ చేశాడు.
Breakup hurts the most?
— Review Bollywood (@ReviewBollywoo1) February 20, 2025
Meanwhile boys after dropping that one catch 😭😭😭 #RohitSharma #indvsban pic.twitter.com/zpqHVR93hn
తొమ్మిదవ ఓవర్‌లో అక్షర్ వరుస బంతుల్లో తంజిద్ హసన్, ముష్ఫికర్ రహీమ్‌ను అవుట్ చేశాడు. ఆ తర్‌వాత వచ్చిన జాకిర్ అలీని అవుట్ చేసేందుకు అక్షర్ ఫ్లైట్ డెలివరీ వేశాడు. అనుకున్నట్టుగానే ఆ బాల్ అలీ బ్యాట్ అవుట్‌సైడ్ ఎడ్జ్ తాకి నేరుగా రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. కానీ ఆ క్యాచ్ పట్టడంతో రోహిత్ విఫలమయ్యాడు.
Bapu with Rohit Sharma after the match#IndvsBanhttps://t.co/I3Cx1wkOEc
— Taha🍉 (@tahaactually) February 20, 2025
Rohit Sharma to Axar patel post match:#IndvsBan pic.twitter.com/toMMZOcGMe
— Skrrt (@fcukitol) February 20, 2025
భారత కెప్టెన్ రోహిత్ తీవ్ర నిరాశతో తన చేతిని నేలపై బలంగా కొడుతూ బాధపడ్డాడు. తర్వాత అక్షర్ పటేల్‌కు క్షమాపణ చెప్పాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో కొందరు ఫీల్డింగ్ అదరగొడుతుంటే మరికొందరు క్యాచ్‌లు పట్టకపోవడంపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ బౌలర్ల ఆరంభం బాగుందని కానీ ఫీల్డర్ల తప్పులతో బంగ్లాదేశ్ స్కోరు వంద దాటిందని అంటున్నారు. పవర్‌ప్లేలో బంగ్లాదేశ్ కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ జాకర్ అలీ, తోహిద్ హ్రిడోయ్ ఆ జట్టును కష్టాల నుంచి బయటపడేశారు. ఇద్దరు చెరో అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నారు.
జాకర్ అలీ, తోహిద్ హ్రిడోయ్‌తో ఆడించింది భారత్ ఫీల్డర్లేనని నెటిజన్లు విమర్సిస్తున్నారు. టీమిండియా ఫీల్డింగ్ చాలా సాధారణంగా ఉందని అంటున్నారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒక క్యాచ్‌ను జారవిడిచాడు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా మిడ్-ఆఫ్‌లో ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. తద్వారా జాకర్ అలీ, తోహిద్ హ్రిడోయ్‌కు లైఫ్ ఇచ్చి వారితో భారీ స్కోరు చేయించారని మండిపడుతున్నారు. కెఎల్ రాహుల్ స్టంపింగ్ చాలా ఆలస్యంగా చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. దీని కారణంగానే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జాకర్ అలీ లైఫ్‌లైన్ అందుకున్నాడు.
Rohit Sharma Drop Easy Catch 😑🫡#IndvsBan #ChampionsTrophy2025 pic.twitter.com/tDhbmdNhDi
— Vk18 Army (@18xarmy) February 20, 2025
How can Rohit Sharma drop such an easy catch & deny Axar Patel a well deserved hat-trick in ICC tournament? And then that GENDA behaviour. 😡 pic.twitter.com/NDhEQ1h8ie
— Vipul 🇮🇳 (@Vipul_Espeaks) February 20, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

