Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Andhra Pradesh Latest News:ఏడాది కాలంగా విధులకు గైర్హాజరవుతున్న 55 మంది ప్రభుత్వ వైద్యులను ఏపీ సర్కారు తొలగించింది. లోకాయుక్త ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంది.

Andhra Pradesh Latest News: ప్రభుత్వం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా తప్పించు తిరుగుతున్న వారిపై కొరడా ఝలిపించింది. ఒకరిద్దరు కాకుండా దాదాపు 55 మందిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వీళ్లంతా చాలా కాలంగా విధులకు రావడం లేదు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే గైర్హాజరు అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారిపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వారందర్నీ తొలగిస్తున్నట్టు అందులో పేర్కొంది.
చాలా కాలంగా ఇలాంటి వైద్యులపై రాష్ట్రవ్యాప్తంగా వస్తున్నాయి. వీటన్నంటిపై లోకాయుక్త విచారణ చేపట్టింది. ఆ విచారణలో వచ్చిన ఫిర్యాదులు నిజమని తేలింది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజలకు సేవలు అందించకుండా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త సిఫార్సు చేసింది. లోకాయుక్త ఆదేశాలు మేరకు వారిని తక్షణం విధుల నుంచి తప్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

