YS Jagan Tour News: జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు
Srikakulam Latest News:రెండేళ్లు పార్టీలో యాక్టివ్‌గా ఉండలేనంటూ చెప్పుకొచ్చిన ధర్మాన సడెన్‌గా వైఎస్ జగన్ టూర్‌లో మెరిశారు. పొలిటికల్ సర్కిల్‌లో కొత్త ప్రచారం నడుస్తోంది.

Srikakulam Latest News: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఓటమి తర్వాత చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తే మరికొందరు పార్టీలో ఉంటూనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారు. ఇలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఓటమితో నైరాశ్యంలో ఉన్న కేడర్‌కు బూస్ట్ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని వారికి ధైర్యం చెప్పి మళ్లీ యాక్టివ్ చేయాలని చాలా మంది సీనియర్ నేతలు ఆయనకు నచ్చ చెప్పారు. ఆయన మాత్రం మూగనోము వీడలేదు.
పార్టీ కార్యక్రమాలపై తనను కలిసిన నాయకులు, కేడర్‌తో ఒకటే చెప్పే వారట. మరో రెండేళ్ల వరకు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కాలేనని కుండబద్దలు కొట్టేవారట. ఇప్పుడు రోడ్డెక్కినా చేసేదేమీ లేదని.. కొన్నాళ్లు మీరు నడపండి.. లేదూ ఇన్‌ఛార్జిగా ఎవర్ని పెట్టినా పార్టీ ఇష్టం అని ఖరాకండి తేల్చిసేవారట. పార్టీలో యాక్టివ్‌గా ఉండలేనంటూ వైసీపీకి అంటీముట్టనట్టుగా ఉంటే ధర్మాన సడెన్‌గా జగన్ పర్యటనలో ప్రత్యక్షమయ్యారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. పాలకొండలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్‌ను ధర్మాన ప్రసాదరావు కలిశారు. తన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ సహా సీనియర్ నేతలు ఎంత చెప్పినా పట్టించుకోని ధర్మనా ఇప్పుడు పాలకొండ వెళ్లడం ఆందర్నీ ఆశ్చరపరిచింది.
వైసీపీ వల్ల తాను నష్టపోయానే తప్ప, తన వల్ల పార్టీ నష్టపోలేదన్న భావనతో ఇన్ని రోజులు ధర్మాన సైలెంట్‌గా ఉండిపోయారు. ఎన్నికలు పూర్తై రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి పార్టీ కోసం అడుగు బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు తన అనుచరులతో పాలకొండ వెళ్లి జగన్‌ను కలిశారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ ధర్మాన తనయుడు చిన్ని చేశారు. ఆయన పిలుపునకు స్పందించి జనం పెద్దగా వచ్చినట్టు కనిపించడం లేదు. స్వయంగా ధర్మాన వెళ్తుండటంతో చాలా మంది ఆయన వెంట పయనమయ్యారు.
Also Read: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నారా ? - ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి
ధర్మాన ప్రసాద్ ఇలా పాలకొండ డగన్ టూర్‌లో పాల్గొనడానికి పెద్ద కారణమే ఉంది. పార్టీతో లేకపోతే ఎవర్నైనా వదులుకోడానికి జగన్ సిద్ధపడటంతోనే ధర్మాన కలిదినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలే తన చివరి ఎన్నికలు అని ప్రచారం చేసిన ధర్మానకు ఓటమి తప్పలేదు. తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం చేద్దామని చూసినా వీలు పడలేదు. అందుకే కుమారుడితోనే రాజకీయం నడిపిద్దామని అనుకున్నా వీలు పడలేదు.
ధర్మాన అనుకున్నది జరగపోగా పూర్తిగా తమ ఆధిపత్యానికే గండి పడే ప్రమాదం ఏర్పడింది. జిల్లా పార్టీ అధ్యక్షుడైన ధర్మాన కృష్ణదాస్ కూడా ధర్మాన పట్ల మెతకవైఖరి అవలంభిస్తున్నారని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. జగన్‌తో జరిగే సమావేశాలకి కూడా రాకపోవడం, కార్యక్రమాలకు దూరంగా ఉండటాన్ని పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. దీని ప్రభావంతో ప్రసాదరావు వల్ల కృష్ణదాస్ పదవికి ఎసరు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని ప్రచారం నడుస్తోంది.
జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకుడి కోసం వైసీపీ అధినాయకత్వం చూస్తోందన్న విషయాన్ని గ్రహించిన ధర్మాన ప్రసాదరావు ఒక మెట్టు దిగినట్టు సమాచారం. ఓటమి పాలైనా పార్టీపై పట్టు తమ ఇంట్లోనే ఉంచుకొని ధర్మాన సోదరులు రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు వేరే వాళ్ల చేతికి వెళ్తే మాత్రం పట్టుకోల్పోతామని గ్రహించారు. అదే టైంలో తమ్మినేని సీతారామ్, సీదరి అప్పలరాజు యాక్టివ్ అవుతున్నారు. ఇద్దరి నుంచి థ్రెట్ తప్పదని తెలుసుకొని జగన్ పర్యటనలో పాల్గొన్నట్టు నేతలు చెప్పుకుంటున్నారు.
Also Read: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

