అన్వేషించండి
Brahmamudi January 22nd Episode Highlights:నందని చంపించేసిన అనామిక.. ఇప్పుడుంటుంది అసలు ట్విస్ట్ - బ్రహ్మముడి జనవరి 22 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 22th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 22nd Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/10

రాజ్ ను ఆఫీసుకి రెడీ చేస్తున్న కావ్యకు కాంప్లిమెంట్స్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంటే కొంగు పట్టుకున్నట్టు ఫీలై ఇప్పుడు టైమ్ లేదండీ అంటూ ఏదో మాట్లాడుతుంది. ఓసారి వెనక్కు తిరిగి చూడు అని రాజ్ అనడంతో చూసి షెల్ఫ్ కి కొంగుచిక్కుకున్నట్టు గమనిస్తుంది.
2/10

ఇంత అందమైన అంటూ క్లాస్ వేస్తుంది కావ్య..రాజ్ సమాధానం చెప్పేలోగా ఎస్సై నుంచి కాల్ వస్తుంది. నందు అడ్రస్ దొరికింది వెంటనే రమ్మని.. అక్కడకు బయలుదేరుతారు రాజ్ కావ్య..
3/10

వాళ్లు బయటకు వెళుతుంటే ఆపిన ధాన్యలక్ష్మి రచ్చ స్టార్ట్ చేస్తుంది. ఈ ఇంట్లో ఏ జరుగుతోందో అందరకీ తెలియాలంటుంది. మేం తొందరగా బయటకు వెళ్లాలని కావ్య రాజ్ చెబుతున్నా ధాన్యం ఒప్పుకోదు.
4/10

మీ కోడలు సమర్థురాలంటూ ఆస్తి మొత్తం ఆవిడ చేతుల్లో పెడితే ... పది కోట్ల కోసం పరువు ప్రతిష్టలు మర్చిపోయి దుగ్గిరాల గెస్ట్ హౌస్ తాకట్టుపెట్టిందని ధాన్యం చెప్పగానే అంతా షాక్ అవుతారు
5/10

ఇంతలో రుద్రాణి రంగంలోకి దిగి..నేడే చూడండి రేపటికి ఈ డాక్యుమెంట్స్ మాయం అవొచ్చంటుంది..మధ్యలో మీకెందుకు అంటుంది స్వప్న. నీకీ విషయం తెలుసా అని ఇందిరాదేవి అడిగితే..తెలుసు నాన్నమ్మ. నాకు తెలియకుండా కావ్య ఏ పని చేయదంటాడు. ఏదో అవసరం వచ్చి తాకట్టు పెట్టారు ఇంత రాద్ధాంతం అవసరమా అంటుంది ఇందిరాదేవి
6/10

ఇంతలోఅంత ఈజీగా తీసేశావేంటని రుద్రాణి అంటే..అడిగే హక్కు నీకు లేదని రివర్సవుతుంది ఇందిరాదేవి. నాకుంది కదా అత్తయ్యా చెప్పండి అంటుంది ధాన్యం. వాళ్లేం చెప్పరు వెళ్లండి ఇక్కడి నుంచి అంటుంది అపర్ణ. రుద్రాణి రంగంలోకి దిగి..నేడే చూడండి రేపటికి ఈ డాక్యుమెంట్స్ మాయం అవొచ్చంటుంది..మధ్యలో మీకెందుకు అంటుంది స్వప్న. నీకీ విషయం తెలుసా అని ఇందిరాదేవి అడిగితే..తెలుసు నాన్నమ్మ. నాకు తెలియకుండా కావ్య ఏ పని చేయదంటాడు. ఏదో అవసరం వచ్చి తాకట్టు పెట్టారు ఇంత రాద్ధాంతం అవసరమా అంటుంది ఇందిరాదేవి
7/10

మేం అర్జెంటుగా వెళ్లాలి సాయంత్రం వచ్చాక అన్నీ చెబుతాం అంటాడు రాజ్. తల్లీ కొడుకులు తిని కూర్చోలేక రోజుకో గొడవ తెస్తుంటారు అంటుంది కావ్య. అక్కడి నుంచి వెళ్లిపోతారు రాజ్ కావ్య.
8/10

స్వప్న కోపంగా రుద్రాణికి క్లాస్ వేస్తుంది. అసలు మీకు ఆ డాక్యుమెంట్స్ ఎలా దొరికాయ్..ఎవరో కావాలనే రాజ్, కావ్యను వెనుక నుంచి గొతులు తీయడానికే ఇలా చేస్తున్నరేమే అంటుంది ..ఈ మాటలకు రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు.
9/10

నంద గెస్ట్ హౌజ్ కి వెళ్లిన రాజ్-కావ్యపై రౌడీలతో అటాక్ చేయిస్తాడు. ఆ రౌడీలను కావ్య తన మాటలతో కన్ఫ్యూజ్ చేసేస్తుంది. బతుకు తెరువుకోసం భార్య బిడ్డల్ని వదిలేసి ఇక్కడకు వచ్చి ఉంటారు..ఇంత కష్టపడేది వాళ్లకోసమే కదా..అలాంటప్పడు ఓ వెధవ కోసం ఫైట్ చేయడం అవసరమా అంటుంది
10/10

బ్రహ్మముడి జనవరి 23 ఎపిసోడ్ లో...నందని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే..ఇప్పుడు దొరికిందా ఇంట్లో చెప్పడానికి సమాధానం అంటాడు రాజ్. ఇంతలో ఎవరో వచ్చి నందని కాల్చేసి వెళ్లిపోతారు.. రాజ్ కావ్య షాక్ అవుతారు..నంద చనిపోయాడని చెబుతారు పోలీసులు...
Published at : 22 Jan 2025 09:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion