అన్వేషించండి
Mrunal Thakur Latest Photos:అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మృణాల్ ఠాకూర్ - బ్లాక్ డ్రెస్సులో ఫిదా చేస్తున్న బ్యూటీ
Mrunal Thakur: చీరలో సంప్రదాయబద్దంగా కనిపించడంతో పాటు మోడ్రన్ డ్రెస్సుల్లో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. తరచూ మోడ్రన్, ట్రెండీ వేర్‌లో ఫొటోలకు ఫోజులు ఇస్తుంది..

Image Credit: mrunalthakur/Instagram
1/7

Mrunal Thakur Instagram: మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
2/7

సౌత్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లోనూ ఛాన్సులు దక్కించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక తన డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా అందరినీ కట్టిపడేస్తుంది.
3/7

చీరలో సంప్రదాయబద్దంగా కనిపించడంతో పాటు మోడ్రన్ డ్రెస్సుల్లో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. తరచూ మోడ్రన్, ట్రెండీ వేర్‌లో ఫొటొలుకు ఫోజులు ఇస్తుంది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.
4/7

తాజాగా ఈ బ్యూటీ క్రాప్ టాప్ అండ్ ప్లాజోలో స్టైలిష్‌గా లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ మీ డేలులు ట్రూలులుగా మారాలి అర్థం కానీ భాషలో క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో మృణాల్ మాత్రం స్టైలిష్‌గా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
5/7

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. తన శరీరాకృతి గురించి చెబుతూ గతంలో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటుంది. ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ మీ శరీరాన్ని ప్రేమించాలని సూచించింది.
6/7

శరీర నిర్మాణం మన చేతుల్లో లేని విషయం అని మృణాల్ వెల్లడించింది. “మీ శరీరం గురించి మీరు ఏం చేయలేని కొన్ని విషయాలు ఉన్నాయి. సహజంగానే కొన్ని శరీర భాగాలు వైకల్యంతో రావచ్చు. అలాంటి మహిళల పట్ల వివక్షణ చూపించడం భారతీయులకు అలవాటుగా మారింది.
7/7

ఎందుకు వారిని చిన్న చూపు చూస్తారో అర్థం కాదు. ఉన్న శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన శరీరం ఎలా ఉన్నా బాధపడాల్సిన అవసరం లేదు. రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. శరీరం ఆరోగ్యంగా ఉండేలా ఆహారం తీసుకుంటే చాలు. నా తొడలు లావుగా ఉంటాయి. అయినా, నాకు ఎలాంటి బాధ లేదు. మీరు కూడా మీ శరీరాన్ని ప్రేమించండి” అని చెప్పుకొచ్చింది.
Published at : 22 Feb 2024 10:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion