అన్వేషించండి
Brahmamudi February 7th Episode Highlights: మందర రుద్రాణి మాట , అనామిక ఆట, అప్పు వేట.. ఇది కదా కావాల్సింది - బ్రహ్మముడి ఫిబ్రవరి 7 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February 7th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi February 7th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/9

అందరూ హాల్లో ఉండగా అప్పు వస్తుంది. పోలీస్ డ్రెస్ లో ఉన్న అప్పుని చూసి రుద్రాణి ఏంటి పగటివేషం అని అవమానిస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంతలో కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి నీ మనసులో ఆలోచనలు మాపై రుద్దొద్దు అత్తా..ఇంట్లో వాళ్ల ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చాం అంటాడు
2/9

ఇందిరాదేవి, అపర్ణాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి అంటే..అమ్మకు ఇష్టం ఉందో లేదో అంటాడు. కొడుకు ఎన్ని తప్పులు చేసినా తల్లిగా నువ్వు బావుండాలనే కోరుకుంటాను కదా అని ఆశీర్వదిస్తుంది ధాన్యలక్ష్మి
3/9

మిమ్మల్ని చూస్తుంటే నా కడుపునిండిపోయింది అంటుంది ఇందిరాదేవి..ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే ఇక్కడే ఉండిపోవాలి మీరు అంటుంది అపర్ణ. వాళ్లు అప్పుడే రారులే వదినా..అయినా కళ్యాణ్ అనుకున్నట్టు తనింకా మంచి పేరు సంపాదించలేదు కదా అని చురకలు వేస్తుంది రుద్రాణి..
4/9

విన్నావ్ గా పెద్దమ్మా..అమ్మతో పాటూ కొందరు మమ్మల్ని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నారు..ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాను అంటాడు. రేపు స్వప్న కూతురికి బారసాల చేయాలి అనుకుంటున్నాం ఈ రోజు ఇక్కడే ఉండిపోండి అంటుంది ఇందిరాదేవి. తప్పకుండా ఇక్కడే ఉంటారు అంటుంది కావ్య.
5/9

గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కావ్య అంటే..నీ అక్కా చెల్లెళ్లు కాబట్టి గ్రాండ్ అంటూ మాటల్లో కోట్లు కురిపిస్తున్నావ్..మా వరకూ ముష్టి వేస్తావ్ అంటుంది రుద్రాణి. దుగ్గిరాలవారింటి కోడళ్లు ఒకరు SI అయ్యారు, మరొకరు తల్లి అయ్యారు ఈ సందర్భాన్ని సలెబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటాం అంటాడు రాజ్..
6/9

చిన్నప్పటి అల్లరి గుర్తుచేసుకుని ముగ్గురు అక్కాచెల్లెళ్లు సరదాగా మాట్లాడుకుంటారు. పాప ఏడుస్తుంటే సముదాయించలేకపోతుంది స్వప్న.. ఇంతలో కావ్య ఎంట్రీ ఇచ్చి పాపను ఎత్తుకుని సాంగేసుకుంటుంది.
7/9

ఈ మగ్గుర్నీ చూస్తూ ఇందిరాదేవి, అపర్ణ మురిసిపోతారు. మనిల్లు మళ్లీ ప్రేమాలయంలా మారాలంటే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లతోనే సాధ్యం అత్తయ్యా అంటుంది అపర్ణ.
8/9

వాడు వెళ్లిపోతాను అంటున్నాడు ఆపండి..తనకి జరిగిన అన్యాయాన్ని అర్థమయ్యేలా చెప్పండి అంటుంది ధాన్యలక్ష్మి. వాడితో నేను మాట్లాడుతాలే అంటాడు ప్రకాశం
9/9

బ్రహ్మముడి ఫిబ్రవరి 08 ఎపిసోడ్ లో...అనామికకు కాల్ చేసిన రుద్రాణి..ఇక్కడ బారసాల ఏర్పాట్లు జరుగుతున్నాయ్. అంతా ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నా అంటుంది. ఆ సంతోషం ముక్కలు చేసేందుకు అక్కడకు వస్తున్నా వాళ్ల గుండెలు బద్దలయ్యే ట్విస్ట్ ఇవ్వబోతున్నా అంటుంది
Published at : 07 Feb 2025 09:23 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion