Illegal Immigrants Deportation | పార్లమెంటులో భగ్గుమన్న ప్రతిపక్షాలు | ABP Desam
అమెరికాలో అక్రమవలసదారులైన భారతీయులను చేతులకు కాళ్లకు సంకెళ్లేసి తీసుకురావటంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ట్రంప్ తన మిత్రుడని చెప్పుకుని మోదీ...చిత్ర హింసలు అనుభవించిన భారతీయులను చూసి కూడా మాట్లాడరా అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఇండీ కూటమి పార్లమెంటులో ఆందోళనకు దిగింది. ఉదయం యూత్ కాంగ్రెస్ నేతలు మోదీకి వ్యతిరేకంగా ఆందోళన చేయగా...పార్లమెంటు సమావేశం ప్రారంభమైన తర్వాత ఇండీ కూటమి నేతలు...ఈ అంశంపై చర్చ పెట్టాలని లోక్ సభలో ఆందోళన చేశారు. స్పీకర్ ఓంబిర్లా అందుకు అంగీకరించకపోవటంతో ఇండీ కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పార్లమెంటు భవనం బయట రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా కూటమి నేతలు నిరసన తెలిపారు. చేతికి సంకేళ్లు వేసుకుని మోదీ మౌనం వీడి ఈ అంశంపై స్పందించాలంటూ నినాదాలు చేశారు. ట్రంప్ తన ఫ్రెండ్ అని చెప్పుకునే మోదీ ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదంటూ ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.





















